ETV Bharat / bharat

Motkupalli Narsimhulu on Chandrababu Arrest : 'చంద్రబాబును చంపాలని చూస్తున్నారు.. ఆయనకేమైనా అయితే ఆ ముగ్గురిదే బాధ్యత'

Motkupalli Narsimhulu on Chandrababu Arrest : ఆంధ్రప్రదేశ్​లో పేద ప్రజలు బతికే పరిస్థితి లేకుండా చేశారని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. ఎదురు మాట్లాడితే.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎంతో దూరంలో లేవని.. చంద్రబాబును బయటకు రాకుండా చేసి ఓట్లను గుద్దుకోవాలని ప్రయత్నమా? అని నిలదీశారు. జగన్‌.. డబ్బులిచ్చి మళ్లీ గెలవాలనే ప్రయత్నం మాదిరిగా కనిపిస్తోందని ఆయన దుయ్యబట్టారు.

motkupalli
motkupalli
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 2:06 PM IST

Motkupalli Narasimhulu on Chandrababu Arrest : వైఎస్​ఆర్​సీపీ, బీఆర్​ఎస్​, బీజేపీ మూడు పార్టీలు కలిసి కుట్ర చేసి చంద్రబాబును చంపాలని చూస్తున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. రాజకీయాలు జనాల్లో చేయాలని, ప్రజలతో మాట్లాడుకొని చేయాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బంధించారని.. చంద్రబాబును హింసించి బాధపెడుతున్నారని తెలిపారు. దుర్మార్గమైన ఆలోచన మంచిది కాదని.. ఇప్పటికైనా మారాలని హితవు పలికారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో పేద ప్రజలు బతికే పరిస్థితి లేకుండా చేశారని మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) ఆరోపించారు. ఎదురు మాట్లాడితే... ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎంతో దూరంలో లేవని.. చంద్రబాబును బయటకు రాకుండా చేసి ఓట్లను గుద్దుకోవాలని ప్రయత్నమా? అని నిలదీశారు. ఈ క్రమంలోనే జగన్‌.. డబ్బులిచ్చి మళ్లీ గెలవాలనే ప్రయత్నం మాదిరిగా కనిపిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపాలని చూస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు దుయ్యబట్టారు.

TDP Nijam Gelavali Program: 'నిజం గెలవాలి' పేరుతో ప్రజాక్షేత్రంలోకి నారా భువనేశ్వరి

Chandrababu Arrest : చంద్రబాబు (Chandrababu) ఏనాడూ కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. తన 40 ఏళ్ల అనుభవంలో ఇలాంటి వేధింపులు చూడలేదని.. చంద్రబాబుకు ఏమైనా అయితే జగన్, కేసీఆర్, బీజేపీలదే బాధ్యతని ఆరోపించారు. ఆయనను లోపలపెట్టి జగన్‌ గెలవాలని చూస్తున్నారని.. ఇది దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదలను జగన్‌ బతకనీయట్లేదని మోత్కుపల్లి నర్సింహులు ఆక్షేపించారు.

CBN Family Emotional After Seeing Chandrababu చంద్రబాబును చూసి భావోద్వేగానికి లోనైన భువనేశ్వరి, లోకేశ్..

జగన్ ప్రజాస్వామ్యవాది కాదని నిరూపించుకుంటున్నారని.. ప్రజాస్వామ్యవాది అయితే ప్రజల ఓట్లతో గెలవాలని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. జగన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని.. రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైన ముఖ్యమంత్రి ఆయనేనని విమర్శించారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా అడ్డుకుంటూ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును హింసిస్తే ఏమొస్తుందని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు.

Minister Mallareddy on Chandrababu arrest చంద్రబాబు దేశంలోనే బెస్ట్ సీఎం..! జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. : మంత్రి మల్లారెడ్డి

Motkupalli Fires on CM Jagan : ఏపీలో ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. చంద్రబాబు కుటుంబానికి భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హింసించి బతకాలనుకోవడం జగన్ (CM Jagan) దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. ఎన్టీఆర్ పెట్టిన జెండా కలకాలం నిలవాలని అన్నారు. దసరా రోజున తాను వ్యక్తిగతంగా ఉపవాసం చేస్తున్నానని.. పండుగకు దూరంగా ఉంటానని మోత్కుపల్లి నర్సింహులు వెల్లడించారు.

"మూడు పార్టీలు కలిసి కుట్ర చేసి చంద్రబాబును చంపాలని చూస్తున్నారు. రాజకీయాలు ప్రజల్లో చేయాలి, ప్రజలతో మాట్లాడుకొని చేయాలి. ప్రజాస్వామ్యాన్ని బంధించారు. చంద్రబాబును హింసించి బాధపెడుతున్నారు. దుర్మార్గమైన ఆలోచన మంచిది కాదు.. ఇప్పటికైనా మారాలి. ఏపీలో పేద ప్రజలు బతికే పరిస్థితి లేకుండా చేశారు. ఎదురు మాట్లాడితే... ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. చంద్రబాబును బయటకు రాకుండా చేసి ఓట్లను గుద్దుకోవాలని ప్రయత్నమా?." - మోత్కుపల్లి నర్సింహులు, మాజీ మంత్రి

Motkupalli on Chandrababu Arrest : 'ముష్టి రూ.300 కోట్లకు చంద్రబాబు ఆశపడతారా?.. జైల్లో ఆయనకేదైనా జరిగితే జగన్‌దే బాధ్యత'

Mothkupally narsimhulu: 'దళిత బంధు దేశవ్యాప్తంగా అమలు చేయించగలరా.?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.