ETV Bharat / bharat

ఇంటి పని చేసుకుంటూనే చదువు.. నలుగురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసిన అత్త - ముఖ్యమంత్రి అక్షర్​ అంచల్​ యోజన పరీక్ష

చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు బిహార్​కు చెందిన 45 ఏళ్ల మహిళ. తన నలుగురు కోడళ్లతో కలిసి శిక్షణ తీసుకొని మరి పరీక్షకు రాశారు. ఇంతకీ వీళ్లు ఏం పరీక్ష రాశారో తెలుసా..?

Bihar Mother in law wrote exam with her daughter in laws
కోడళ్లతో శివర్తి దేవి
author img

By

Published : Mar 7, 2023, 3:26 PM IST

కొన్ని దశాబ్దాల క్రితం కుటుంబ పరిస్థితులు, చదివించేవాళ్లు లేక చదవలేకపోయేవారు మహిళలు. మరి ఇప్పుడేమో రూ.లక్షల్లో ఖర్చుచేసి మరీ తమ పిల్లల్ని చదివిస్తున్నారు తల్లిదండ్రులు. అలాగే ఏ వయసులో చేయాల్సిన పనులు అప్పుడేే చేయాలని చెబుతున్నారు పెద్దలు. అయితే చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు బిహార్​.. నలందాకు చెందిన శివర్తి దేవి అనే మహిళ. 45 ఏళ్ల వయస్సులో కూడా ఇంటిపనులు చూసుకుంటూ తన నలుగురు కోడళ్లతో కలిసి పరీక్ష రాశారు.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బిహార్​లో అక్షరాస్యత శాతం తక్కువే. మరీ ముఖ్యంగా మహిళా అక్షరాస్యత ఇంకా తక్కువ. 2009నాటికి బిహార్​లో మహిళా అక్షరాస్యత 33 శాతమే. అయితే అక్షరాస్యతను పెంచేందుకు అప్పటి బిహార్​ ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళల కోసం 'ముఖ్యమంత్రి అక్షర్​ అంచల్​ యోజన' పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద మహిళలకు ప్రాథమిక పరీక్ష​ రాసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈ పరీక్షను నలుగురు కోడళ్లతో పాటు అత్త కూడా ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుని ప్రాథమిక పరీక్ష​ను రాశారు. శివర్తి దేవితో పాటు ఆమె కోడళ్లు.. శోభా దేవి, సీమా దేవి, వీణా దేవి, బింది దేవి పరీక్ష రాశారు. నలందా జిల్లా వ్యాప్తంగా 9,698 మంది మహిళలు ఈ ప్రాథమిక పరీక్షను రాశారు.

ఈ పరీక్షను రాసేందుకు గత ఆరు నెలలుగా శిక్షణ తీసుకున్నారు ఈ మహిళలు. శిక్షణ పూర్తి కావడం వల్ల ఆదివారం వీరందరూ నలందా జిల్లా చండి గ్రామంలోని ఆదర్శ్ మధ్య విద్యాలయలో ప్రాథమిక పరీక్ష రాశారు. కాగా, కోడళ్లతో కలిసి అత్త పరీక్ష రాయడానికి రావడం వల్ల ప్రస్తుతం శివర్తి దేవి వార్తల్లో నిలిచారు. తమ అత్తతో కలిసి శిక్షణ తీసుకొని పరీక్ష రాయడం ఆనందంగా ఉందని చెబుతున్నారు నలుగురు కోడళ్లు. ఈ వయసులో కూడా చదువు పట్ల శివర్తి దేవికి ఉన్న ఆసక్తి, అభిరుచిని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. అలాగే మిగతా మహిళలకు ఈమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Bihar Mother in law wrote exam with her daughter in laws
కోడళ్లతో శివర్తి దేవి
Bihar Mother in law wrote exam with her daughter in laws
నలుగురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసిన అత్త శివర్తి దేవి

"గత ఆరు నెలల శిక్షణలో మేము చదువుకి సంబంధించిన కనీస విషయాలను తెలుసుకున్నాం. దీంతో మేము సొంతంగా మా పేర్లు రాయగలుగుతున్నాం, చదవగులుగుతున్నాం. అంతే కాకుండా ఇతర లెక్కలు కూడా చేయగలుగుతున్నాం. మేము మా ఇళ్లల్లో, పొలాల్లో మా బాధ్యతలను నిర్వహిస్తూనే ఈ శిక్షణను తీసుకున్నాం."

- శోభా దేవీ, శివర్తి దేవి కోడలు

ఏంటీ అక్షర పథకం..?
బిహార్​లో నిరక్షరాస్యతను అధిగమించేందుకు 2009 సెప్టెంబరులో అప్పటి ప్రభుత్వం 15 నుంచి 45 ఏళ్ల వయసున్న మహిళలకు కనీస విద్యాబుద్ధులను నేర్పించాలనే ఉద్దేశంతో 'ముఖ్యమంత్రి అక్షర్​ అంచల్​ యోజన' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ శిక్షణను 6 నెలల పాటు అందిస్తారు. ఇందులో వర్ణమాల, అంకెలు, కూడికలు, తీసివేతలు, ప్రభుత్వ పథకాలు, ఇంగ్లీష్​తో పాటు సంతకం పెట్టడం వంటి చిన్న చిన్న విషయాలను మహిళలకు నేర్పిస్తారు. ఆరు నెలల శిక్షణ అనంతరం వీరికి పరీక్షను కూడా నిర్వహిస్తారు అధికారులు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను అందజేస్తుంది బిహార్​ విద్యాశాఖ. ప్రతి ఆరు నెలలకోసారి ఈ పరీక్షను నిర్వహిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.