ETV Bharat / bharat

Modi Parliament Speech Today : 'రైల్వే ప్లాట్‌‌ఫామ్‌ నుంచి అత్యున్నత స్థానానికి'.. మాజీ ప్రధానుల సేవలను కొనియాడిన మోదీ - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023

Modi Parliament Speech Today : స్వాతంత్ర్యం అనంతరం భారత నవ నిర్మాణానికి సాక్షిభూతంగా నిలిచిన పార్లమెంట్‌ పాత భవనానికి.. వీడ్కోలు పలకడం భావోద్వేగాలతో కూడుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం నుంచి పార్లమెంట్‌ కార్యకలాపాలు నూతన భవనంలో జరుగుతాయని వెల్లడించారు. భవిష్యత్తుపై భరోసాతో తాము నూతన భవనానికి.. కొత్త ఆశ, విశ్వాసంతో బయలుదేరుతున్నామని ప్రధాని వివరించారు. తీపి, చేదు జ్ఞాపకాలకు పాత పార్లమెంట్‌ వేదికగా నిలిచిందన్న మోదీ అనేక చరిత్రాత్మక నిర్ణయాలను ఈ భవనంలో తీసుకున్నట్లు గుర్తు చేశారు.

parliament-special-session-modi-speech-in-lok-sabha-today

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 12:26 PM IST

Updated : Sep 18, 2023, 4:04 PM IST

Modi Parliament Speech Today : భారత్‌ సువర్ణాధ్యాయానికి సాక్షిగా నిలిచిన పార్లమెంట్‌ పాత భవనంలో... 75 ఏళ్లపాటు జరిగిన చర్చలు, ప్రణాళికలు భారత గతిని మార్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ఈ భవనం వేదికైందని గుర్తు చేశారు. నెహ్రూ నుంచి వాజపేయీ, మన్మోహన్‌సింగ్ వరకు ఈ సభకు నేతృత్వం వహించారని గుర్తు చేసిన ప్రధాని.. వారి సేవలను కొనియాడారు. దీంతో పాటు మన్మోహన్ సింగ్​ హయాంలో జరిగిన నోటుకు ఓటు కుంభకోణాన్ని ప్రధాని గుర్తు చేశారు. అనేకమంది ఉద్ధండులు ఈ సభలో ప్రజా ప్రయోజనాల ఉపన్యాసాలు వెలువరించారన్నారు. చర్చల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్ని ఉన్నా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా నిలిచాయని తెలిపారు. లోక్‌సభ ప్రత్యేక సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై సోమవారం ప్రధాని మోదీ చర్చను ప్రారంభించారు.

  • #WATCH | Special Session of the Parliament | PM Modi says, "...Several historic decisions and solutions to issues pending for several decades were made in this House. The House will always say proudly that (abrogation of) Article 370 became possible due to it. GST was also passed… pic.twitter.com/1acCPUzXBu

    — ANI (@ANI) September 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మంగళవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలు కొత్త భవనంలో జరగనున్న వేళ.. పాత భవనంతో జ్ఞాపకాలను మోదీ గుర్తు చేసుకున్నారు. గంటకుపైగా ప్రసంగించిన మోదీ.. భారత ప్రజాస్వామ్య ప్రయాణాన్ని స్మరించుకున్నారు. ఈ వారసత్వ భవనంలో చివరి రోజు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పనిచేసిన 7 వేల 500 మంది ఎంపీల సేవలను కొనియాడారు. ఈ పార్లమెంట్ భవనంలో ప్రతీ ఇటుకకు సెల్యూట్‌ చేస్తున్నట్లు మోదీ తెలిపారు. తాము కొత్త భవనానికి వెళ్లినా.. ఈ పాత భవనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. స్వాతంత్ర్య భారత ప్రయాణంలో ఈ పార్లమెంట్‌ది ముఖ్యమైన అధ్యాయమని మోదీ అన్నారు. పాత పార్లమెంట్‌ భవనంలో జరిగే చివరి సెషన్‌ చారిత్రకమైనదన్న మోదీ.. భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇది కీలకమైన ఘట్టమని అభిప్రాయపడ్డారు. పాత పార్లమెంట్ భవన నిర్మాణం కోసం దేశవాసులు రక్తం, స్వేదం చిందించారని కొనియాడారు. పాత భవనంలో జరిగిన ఎన్నో చర్చలు నవ భారత నిర్మాణానికి దోహదం చేశాయన్నారు.

  • #WATCH | Special Session of the Parliament | Prime Minister Narendra Modi says, "...The echoes of Pandit Nehru's "At the stroke of the midnight..." in this House will keep inspiring us. In this House itself, Atal ji had said, "Sarkarein aayegi-jaayegi, partiyan banegi-bigdegi,… pic.twitter.com/MdYI4p6MfC

"భారత పార్లమెంట్‌ 75 ఏళ్ల ప్రయాణాన్ని మరోసారి స్మరించుకునేందుకు ఇది సరైన సమయం. కొత్త పార్లమెంట్‌ భవనంలోకి వెళ్లేముందు ప్రేరణగా నిలిచిన చారిత్రక ఘటనలను గుర్తుచేసుకుని ముందుకు సాగడం అవసరం. ఈ భవనానికి వీడ్కోలు పలకడం ఒక ఉద్వేగభరితమైన క్షణం. ఇప్పుడు మేం ఈ భవనాన్ని విడిచి వెళ్తున్నాం. ఇప్పుడు మా మనసంతా భారంగా మారింది. ఎన్నో జ్ఞాపకాలతో భారంగా మారింది. ఈ భవనంతో ఎన్నో చేదు, తీపి జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఈ పార్లమెంట్‌లో మనమందరం ఎన్నో విభేదాలను, వివాదాలను చూశాం. కొన్నిసార్లు ఉత్సవాలకు ఈ భవనం వేదికగా నిలిచింది. స్వాతంత్ర్య భారత్‌ నవనిర్మాణానికి అవసరమైన ఎన్నో నిర్ణయాలు ఈ 75 ఏళ్లలో ఇదే పార్లమెంట్‌లో రూపం దాల్చడం మనమందరం చూశాం. ఇప్పుడు మనం ఈ చారిత్రక భవనం నుంచి వెళ్లిపోతున్నాం. ఈ పాత పార్లమెంట్ భవనం మన దేశ ప్రజల చెమట, శ్రమ, డబ్బుతో నిర్మించారని గర్వంతో చెప్పుకుంటున్నాం."

--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

Modi Speech In Lok Sabha Today : పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్‌ సభ్యులను రక్షించేందుకు భద్రతా బలగాలు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

"ప్రజాస్వామ్య సౌధమైన ఈ పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇది కేవలం ఓ భవనంపై దాడి కాదు. ఇది ఒకరకంగా ప్రజాస్వామ్య మాతృమూర్తిపై, మన జీవాత్మపై దాడి. ఈ దేశం ఆ దాడిని మర్చిపోదు. ఈ భవనాన్ని, సభ్యులను కాపాడేందుకు ఉగ్రవాదులతో పోరాడుతూ చాలామంది బుల్లెట్‌ గాయాలతో మరణించారు. ఈరోజు నేను వారికి నమస్కరిస్తున్నాను."

--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

PM Modi Speech In Parliament Today : భారత్‌ అభివృద్ధి వీచికలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయన్న మోదీ.. 75 ఏళ్లలో మనం సాధించిన ప్రగతి ప్రపంచాన్ని అబ్బురపర్చిందని వ్యాఖ్యానించారు. చంద్రయాన్‌-3 విజయం భారత సాంకేతిక, విజ్ఞాన అభివృద్ధికి నిదర్శనమని.. భారత శాస్త్ర సాంకేతిక నిపుణులకు ఈ భవనం నుంచి శతకోటి వందనాలు సమర్పిస్తున్నాని ప్రధాని అన్నారు. జీ20 సదస్సు విజయం ఏ ఒక్క పార్టీదో, వ్యక్తిదో కాదని.. యావత్‌ 140 కోట్ల భారతీయులదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ పాత భవనం ఎన్నో చారిత్రక నిర్ణయాలకు వేదికగా నిలిచిందని మోదీ గుర్తు చేశారు.

"అనేక చారిత్రక నిర్ణయాలను ఈ పార్లమెంటులో తీసుకున్నారు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలకు ఈ సభలో పరిష్కారం లభించింది. ఇక్కడే ఆర్టికల్‌ 370 రద్దు అనేది సాధ్యమైనందుకు ఈ సభ గర్విస్తుంది. ఒకే దేశం, ఒకే పన్ను- జీఎస్టీ బిల్లు ఇక్కడే ఆమోదం పొందింది. ఒకే దేశం-ఒకే పింఛన్‌ అమలుకు ఈ సభ సాక్షిగా నిలిచింది. తొలిసారిగా వివాదాలు లేకుండా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గానికి 10 శాతం రిజర్వేషన్‌ను ఆమోదించడం ఇక్కడ జరిగింది."

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

'రైల్వే ప్లాట్‌‌ఫామ్‌ నుంచి అత్యున్నత స్థానానికి'
దేశం నుంచి ఇంతటి ప్రేమ, గౌరవం లభిస్తాయని తానెప్పుడూ ఊహించలేదన్న మోదీ.. రైల్వే స్టేషన్‌ ప్లాట్‌‌ఫామ్‌పై పనిచేసిన వ్యక్తి ఈ సభలో అత్యున్నత స్థానం పొందారని మోదీ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. అందుకు తాను దేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని అన్నారు.

'కేంద్ర సంస్థలతో ప్రతిపక్ష రాష్ట్రాలపై దాడి'
దేశం.. ఒకే పార్టీ నియంతృత్వం దిశగా సాగుతోందని ప్రజలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని.. ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్​ 75 ఏళ్ల ప్రస్థానంపై మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం సమాజంలో కలుపుగోలుతనం పోయిందని విమర్శించారు. పార్లమెంట్ సైతం దీనికి మినహాయింపు కాదని.. మైనారిటీ ఎంపీల సంఖ్యే దీనికి నిదర్శనమన్నారు.

  • #WATCH | Special Session of the Parliament | Congress MP Adhir Ranjan Chowdhury says "There were discussions going on about Chandrayaan, I want to say that in 1946, under the leadership of Jawaharlal Nehru, the Atomic Research Committee was formed. From there, we moved forward… pic.twitter.com/YmiwuBNJuV

PM Modi on Andhra Pradesh Telangana Division : 'ఏపీ, తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదు'.. పార్లమెంట్​లో మోదీ

Parliament Special Session History : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. చరిత్ర ఏం చెబుతోంది?.. అదే అజెండానా!

Last Updated : Sep 18, 2023, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.