Modi In Bhopal : 2024లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందనే.. విపక్షాలు కడుపు మంటతో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. అందుకోసమే ప్రతిపక్షాలు ఏకమై.. సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీయే.. కోట్ల రూపాయల అవినీతి చేసిందని.. ఆర్జేడీ, టీఎంసీ, ఎన్సీపీ.. ఇలా అన్ని పార్టీలు కుంభకోణాలతో నిండిపోయాయని ఆరోపించారు. తాము ఏసీ గదుల్లో కూర్చొని.. ఆదేశాలు జారీ చేసేవాళ్లం కాదంటూ కాంగ్రెస్‌కు పరోక్షంగా చురకలు అంటించారు మోదీ. తాము ప్రజల కోసం.. వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిరంతరం పనిచేస్తామని చెప్పారు. మధ్యప్రదేశ్ భోపాల్‌లో పర్యటించిన ఆయన.. 10 లక్షల మంది బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు. బీజేపీకి.. బూత్ స్థాయి కార్యకర్తలే అతి పెద్ద బలమని కొనియాడారు. వారే బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చేశారని అభినందించారు. 2047లో స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామన్నారు. ప్రతి గ్రామం బాగుపడితేనే ఇది సాధ్యపడుతుందని.. అందుకోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు.
-
मोदी-मोदी की गूंज…#MeraBoothSabseMazboot
— BJP (@BJP4India) June 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">मोदी-मोदी की गूंज…#MeraBoothSabseMazboot
— BJP (@BJP4India) June 27, 2023मोदी-मोदी की गूंज…#MeraBoothSabseMazboot
— BJP (@BJP4India) June 27, 2023
-
Don't be angry, pity them...
— BJP (@BJP4India) June 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
People and parties who used to abuse each other are now falling on each other's feet, and this reflects their helplessness...
- PM @narendramodi #MeraBoothSabseMazboot pic.twitter.com/otLu01cmZF
">Don't be angry, pity them...
— BJP (@BJP4India) June 27, 2023
People and parties who used to abuse each other are now falling on each other's feet, and this reflects their helplessness...
- PM @narendramodi #MeraBoothSabseMazboot pic.twitter.com/otLu01cmZFDon't be angry, pity them...
— BJP (@BJP4India) June 27, 2023
People and parties who used to abuse each other are now falling on each other's feet, and this reflects their helplessness...
- PM @narendramodi #MeraBoothSabseMazboot pic.twitter.com/otLu01cmZF
"ప్రతి బీజేపీ కార్యకర్త.. పార్టీ కంటే దేశమే ముఖ్యమని భావిస్తాడు. అలాంటి 10 లక్షల బూత్ కార్యకర్తలతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యావాదాలు. ఇలాంటి కార్యక్రమం.. ఏ రాజకీయ పార్టీ చరిత్రలోనూ జరగలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించడంలో మధ్యప్రదేశ్ కీలక పాత్ర పోషించింది."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'యూసీసీపై ప్రజలను రెచ్చగొడుతున్నారు'
Modi On UCC : యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు ప్రధాని మోదీ. ఒక దేశం రెండు చట్టాలతో ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. రాజ్యాంగం సైతం సమాన హక్కుల గురించి చెబుతోందని.. సుప్రీం కోర్టు యూసీసీని అమలు చేయాలని కోరిందని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజలతో ఆడుకుంటున్నాయని దుయ్యబట్టారు.
-
#WATCH | Prime Minister Narendra Modi takes jibe on the opposition meeting held in Patna on June 23.
— ANI (@ANI) June 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
"Opposition is furious because BJP is going to win the 2024 elections so they are doing meetings and coming together...Opposition is the guarantee of corruption and scams.… pic.twitter.com/WGx4eaZQAY
">#WATCH | Prime Minister Narendra Modi takes jibe on the opposition meeting held in Patna on June 23.
— ANI (@ANI) June 27, 2023
"Opposition is furious because BJP is going to win the 2024 elections so they are doing meetings and coming together...Opposition is the guarantee of corruption and scams.… pic.twitter.com/WGx4eaZQAY#WATCH | Prime Minister Narendra Modi takes jibe on the opposition meeting held in Patna on June 23.
— ANI (@ANI) June 27, 2023
"Opposition is furious because BJP is going to win the 2024 elections so they are doing meetings and coming together...Opposition is the guarantee of corruption and scams.… pic.twitter.com/WGx4eaZQAY
"ఒక ఇంట్లో కుటుంబంలోని ఒక వ్యక్తికి ఒక చట్టం, మరో వ్యక్తికి మరో చట్టం ఉంటే కుటుంబం నడుస్తుందా? మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే.. రాజ్యాంగంలోనూ ప్రజలందరికీ సమానహక్కులు ఉండాలని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు మనపై ఆరోపణలు చేస్తున్నాయి. వారు నిజంగా ముస్లింల శ్రేయస్సు కోరుకుంటే ఎక్కువ కుటుంబాలు, ముస్లిం సోదరసోదరీమణులు విద్య, ఉద్యోగాల్లో వెనకబడరు, కష్టాలజీవితం అనుభవించాల్సిన అవసరమే ఉండదు. ఉమ్మడి పౌరస్మృతి తేవాలని సుప్రీంకోర్టు పదేపదే చెబుతోంది."
--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
'ముస్లిం దేశాల్లోనే త్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేశారు'
ట్రిపుల్ తలాఖ్‌కు మద్దతు తెలిపేవారు.. ముస్లిం మహిళలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు మోదీ. ఈ పద్ధతి ఇస్లాం నుంచి విడదీయరానిదైతే.. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్ లాంటి దేశాల్లో ఎందుకు ట్రిపుల్ తలాఖ్‌ను తొలగించారని ప్రశ్నించారు. 90 శాతం సున్నీ ముస్లింలు ఉన్న ఈజిప్ట్‌లో తలాఖ్ విధానాన్ని 90 ఏళ్ల కిందే రద్దు చేశారని గుర్తుచేశారు.
-
#WATCH | "Those who are supporting the triple talaq are doing grave injustice to Muslim daughters," says PM Modi while interacting with booth workers in Bhopal pic.twitter.com/v7OwDoG1Vm
— ANI (@ANI) June 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | "Those who are supporting the triple talaq are doing grave injustice to Muslim daughters," says PM Modi while interacting with booth workers in Bhopal pic.twitter.com/v7OwDoG1Vm
— ANI (@ANI) June 27, 2023#WATCH | "Those who are supporting the triple talaq are doing grave injustice to Muslim daughters," says PM Modi while interacting with booth workers in Bhopal pic.twitter.com/v7OwDoG1Vm
— ANI (@ANI) June 27, 2023
ఇవీ చదవండి : మరో 9 నగరాలకు వందే భారత్.. ఒకేసారి 5 రైళ్లకు జెండా ఊపిన మోదీ
'మోదీ నా కుమారుడు.. 25 ఎకరాలు ఆయనకే రాసిస్తా'.. వందేళ్ల బామ్మ ఎమోషనల్!