ETV Bharat / bharat

'మోదీ వల్లే దేశానికి స్వతంత్ర భద్రతా విధానం' - యాంటీ డ్రోన్​ టెక్నాలజీ

ప్రధానిగా నరేంద్ర మోదీ వల్లే దేశానికి స్వతంత్ర భద్రతా విధానం లభించిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. దేశ సార్వభౌమత్వాన్ని సవాల్​ చేసే వారికి అదే రీతిలో సమాధానమిస్తామని హెచ్చరించారు. డ్రోన్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో.. స్వదేశీ యాంటీ డ్రోన్​ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

Amit Shah
కేంద్ర హోంమంత్రి అమిత్​ షా
author img

By

Published : Jul 17, 2021, 7:02 PM IST

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే.. దేశానికి స్వతంత్ర భద్రతా విధానం దక్కిందని తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అప్పటివరకు ఉన్న భద్రతా విధానాలు.. విదేశీ విధానాలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయని అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి అవి విదేశీ విధానాలతో కలిసిపేయేవని పేర్కొన్నారు.

'రుస్తాంజీ మెమోరియల్​ లెక్చర్​' కార్యక్రమంలో భాగంగా సరిహద్దు భద్రతా దళం సిబ్బంది, అధికారులతో మాట్లాడారు షా. పలువురు సైనికులు, సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్లకు గ్యాలంట్రీ మెడల్స్​ ప్రదానం చేశారు.

"నరేంద్ర మోదీ ప్రధాని అయ్యే వరకు ఈ దేశానికి భద్రతా విధానం ఉందా? అంటే సందేహమే. అప్పటి వరకు మనకు స్వతంత్ర భద్రతా విధానం లేదు. మోదీ వచ్చాకే దేశానికి స్వతంత్ర భద్రతా పాలసీ వచ్చింది. అందరితో శాంతియుత సంబంధాలు కలిగిఉండాలనేదే మా ఆలోచన. కానీ, ఎవరైనా మన సరిహద్దులను మార్చే ప్రయత్నం చేస్తే, మన సార్వభౌమత్వాన్ని సవాల్​ చేస్తే.. అదే స్థాయిలో సమాధానమివ్వటమే మన భద్రతా విధాన లక్ష్యం. ఈ పాలసీ అతి పెద్ద విజయం. స్వతంత్ర భద్రతా విధానం లేకుండా దేశం అభివృద్ధి చెందదు, అలాగే ప్రజాస్వామ్యం విరాజిల్లదు. దానిని మోదీ జీ సాధించారు."

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

ప్రస్తుతం 3శాతం మేర కంచె లేకుండా ఉన్న సరిహద్దులు.. చొరబాటుదారులకు అనుకూలంగా మారుతున్నట్లు చెప్పారు షా. వచ్చే ఏడాది నాటికి దేశ సరిహద్దులను కంచెతో మూసివేస్తామని స్పష్టం చేశారు.

స్వదేశీ యాంటీ-డ్రోన్​ టెక్నాలజీ

జమ్మూ వాయుసేన స్థావరంపై డ్రోన్​ దాడి జరిగిన 20 రోజుల తర్వాత ఈ విషయంపై స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. స్వదేశీ యాంటీ డ్రోన్​ సాంకేతికతను అభివృద్ధి చేయటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమన్నారు. ఆ దిశగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) పనిచేస్తోందని తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన అన్ని పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. కృత్రిమ మేధ వినియోగించేందుకు బీఎస్​ఎఫ్​ అధికారులు సిద్ధంగా ఉండాలని, ఉగ్రవాదులు, స్మగ్లర్లు సృష్టించే సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు నిపుణులతో భాగస్వామ్యమై పని చేయాలన్నారు.

ఇదీ చూడండి: భారత్​కు యుద్ధ హెలికాప్టర్లు అప్పగించిన అమెరికా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.