ETV Bharat / bharat

చెల్లిని చంపి.. అన్న అండతో అడవిలో పూడ్చిన బాలుడు

అన్నయ్య అంటే చెల్లికి రక్షణగా ఉండేవాడు. ఆపత్కాలంలో అండగా నిలవాల్సిన ఓ అన్నయ్యే.. సొంత చెల్లిపట్ల కనికరం లేకుండా ప్రవర్తించాడు. బలమైన కర్రతో ఆమె తలపై కొట్టి హత్య చేశాడు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది.

Minor boy kills younger sister after altercation in UP's Bulandshahr
చెల్లిని చంపి.. అన్నయ్య అండతో అడవిలో పూడ్చిన బాలుడు
author img

By

Published : Apr 11, 2021, 2:40 PM IST

యూపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బులంద్​షహర్​లో అన్నా, చెల్లెళ్ల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం.. ఏకంగా బాలిక ప్రాణాల్నే బలిగొంది. ఆ తర్వాత తన అన్నయ్య సాయంతో ఆ బాలికను అడవిలో పాతిపెట్టాడా బాలుడు.

ఏం జరిగిందంటే?

బులంద్​షహర్​ జిల్లా మక్సుదాబాద్​ గ్రామానికి చెందిన మైనర్​ అన్నాచెల్లెళ్లు గోధుమ పంట పండిస్తున్నారు. ఇద్దరూ కలిసి పొలానికెళ్లగా.. పంటకోత విషయంలో అక్కడ ఇరువురి మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తింది. ఈ వివాదంలో సోదరి తలపై కర్రతో పదేపదే కొట్టాడా బాలుడు. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం.. అన్నయ్య సాయంతో ఆ బాలిక మృతదేహాన్ని కాలువ సమీపంలోని ఓ అడవిలో పూడ్చిపెట్టాడు.

ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటికే ఓ నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.

ఇదీ చదవండి: మురికివాడలో భారీ అగ్నిప్రమాదం- గుడిసెలు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.