KTR Tweet On Postponement TSPSC Group-2 Exam : గ్రూపు 2 పరీక్షలు వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. టీఎస్‌పీఎస్సీ ని సంప్రదించి గ్రూప్ 2 రీషెడ్యూల్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. లక్షలాది మంది అభ్యర్ధులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో కూడా నియామక ప్రకటనల జారీలో ప్రణాళిబద్దంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ సీఎస్‌కు సూచించినట్టు మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రతి అభ్యర్ధి అర్హత ఉన్న అన్నీ పరీక్షలు రాసే విధంగా తగిన సమయం ఉండాలని సీఎం చెప్పినట్టు కేటీఆర్ తెలిపారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కొద్ది రోజులుగా అభ్యర్ధులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వారికి వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే దీనిపై సోమవారం హైకోర్టులో కూడా విచారణ జరగనుంది.
KTR Tweet On Postponement TSPSC Group-2 Exam : గ్రూప్- 2 పరీక్ష రీషెడ్యూల్‌కు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం - మంత్రి కేటీఆర్ ట్వీట్
22:17 August 12
KTR Tweet On Postponement TSPSC Group-2 Exam : గ్రూప్- 2 పరీక్ష వాయిదా విషయంపై మంత్రి కేటీఆర్ ట్వీట్