Microsoft Internship 2023 : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్.. ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు ఓ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. తమ సంస్థలో ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో మంచి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా రాణించేందుకు ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా ప్రపంచ స్థాయి టీమ్‌లతో మమేకమవ్వడం, పనిలో మెలుకువలు తెలుసుకోవడం లాంటివి.. స్టూడెంట్స్‌గా ఉన్న దశలోనే నేర్చుకోవచ్చు. ఇంటర్న్‌షిప్‌కు కావలసిన అర్హతలు, మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌షిప్‌కు కావాల్సిన అర్హతలు..
Microsoft Internship Eligibility :
- ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదంటే మాస్టర్ డిగ్రీ చదివే విద్యార్థులు మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌షిప్‌కు అర్హులు.
- ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్, దానికి సంబంధించిన కోర్సులే చేస్తుండాలి.
- ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన తర్వాత కనీసం ఒక అదనపు క్వార్టర్/సెమిస్టర్ పరీక్షలు మీకు మిగిలి ఉండాలి.
- అదేవిధంగా ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ లాంగ్వేజ్‌లో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
- కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్, డేటా స్ట్రక్చర్, అల్గారిథమ్ తెలిసి ఉండాలి.
మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
Microsoft Internship Benefits : సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా.. బృంద సభ్యులతో కలిసి సమస్యలను పరిష్కరిస్తారు. దాంతోపాటు సాఫ్ట్వేర్ సొలూషన్స్లో వినూత్న ఆలోచనలకు స్వీకారం చుట్టేందుకు అవకాశం పొందుతారు. సేవల్లో నాణ్యత కోసం, కస్టమర్ల సంతప్తి కోసం పనిచేయడం ఏలానో నేర్చుకుంటారు. పొగ్రామ్ మేనేజర్ల నుంచి మెలుకువలు సైతం తెలుసుకుంటారు.
ముఖ్యంగా ఈ ఇంటర్న్‌షిప్ వలన విద్యార్థి దశలోనే వినియోగదారులకు కావసిన సేవలు, అవసరాలు గురించి మీకొక అవగాహన ఏర్పడుతుంది. దాంతో పాటు కొత్త సాంకేతికతను, వివిధ రకాల టూల్స్‌ను, ఇతర పద్ధతులను ఉపయోగించి.. సాఫ్ట్వేర్ సొలూషన్స్ను ఎలా చేయాలనేది నేర్చుకుంటారు. సాఫ్ట్వేర్ డిజైన్, డెవలపింగ్, న్యూ జనరేషన్ సాఫ్ట్వేర్ క్రియేషన్ మొదలైన వాటిపై.. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే మంచి అవగాహన పొందుతారు.
ఎక్కడ పనిచేయాలి..
ఎంపికైన విద్యార్థులు.. బెంగళూరు, హైదరాబాద్, నోయిడా నగరాలలో మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌షిప్ చేయవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
మైక్రోసాఫ్ట్ సంస్థలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే.. Microsoft Careers FAQ పేజీని సందర్శించండి. అనంతరం దరఖాస్తు, ఇంటర్వ్యూ తదితర వివరాలు తెలుసుకోండి.