ETV Bharat / bharat

'గూగుల్​ ఆఫీస్​లో బాంబు'.. పోలీసులను తిప్పలు పెట్టిన హైదరాబాదీ

పుణె గూగుల్​ కార్యాలయంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్​ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్​ డిటెక్షన్​ స్క్వాడ్​ సహాయంతో తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత ఏమైందంటే?

MH Threat to blow up Googles office in Pune

author img

By

Published : Feb 13, 2023, 12:52 PM IST

మహారాష్ట్ర.. పుణెలో ఉన్న గూగుల్​ కార్యాలయంలో బాంబు ఉందని బెదిరింపు కాల్​ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. చివరకు అది బూటకమని​ అని తేలింది. అయితే ఈ బెదిరింపు కాల్​కు పాల్పడ్డ వ్యక్తిని.. హైదరాబాద్​లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్​ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్​ ఉన్న గూగుల్​ ఆఫీస్​కు ఆదివారం ఓ వ్యక్తి కాల్​ చేశాడు. పుణె.. కోరేగావ్​ పార్క్​లో ఉన్న గూగుల్​ కార్యాలయంలో బాంబు ఉన్నట్లు తెలిపాడు. వెంటనే ముంబయి పోలీసులకు కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు. వారు అప్రమత్తమై పుణె పోలీసులకు విషయాన్ని చేరవేశారు. హుటాహుటిన పుణె పోలీసులు.. గూగుల్​ కార్యాలయానికి చేరుకున్నారు. బాంబు డిటెక్షన్ స్క్వాడ్​ సహాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో ఎక్కడా ఎలాంటి అనుమానస్పద వస్తువులు లభించలేదు. ఎలాంటి బాంబు లేదని, అది బూటకపు కాల్​ అని నిర్ధరించుకున్నారు.

కాగా, గూగుల్ సంస్థ​ తరపున దిలీప్​ తాంబే.. ఈ ఘటనపై ముంబయిలోని బీకేసీ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్​కు చెందిన పాణ్యం బాబు శివానంద్​ అనే వ్యక్తి కాల్​ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్​ చేరుకుని అతడిని అరెస్ట్​ చేశారు. అతడు మద్యం మత్తులో కాల్​ చేశాడని పోలీసులు తెలిపారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.