Ajit Pawar NDA : అనుమానాలే.. నిజమయ్యాయి. కొద్దికాలంగా శరద్ పవార్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్.. అధినేతపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో చేరారు. తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ఉండగా.. ఇప్పుడు రెండో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్.. ప్రమాణం చేశారు. పవార్‌తోపాటు ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, ధర్మారావ్ అట్రాం, సునీల్ వాల్సడే, అదితి తట్కరే, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, అనిల్ పాటిల్ మంత్రులుగా ముంబయిలోని రాజ్‌భవన్‌లో ప్రమాణం చేశారు.
-
#MaharashtraPolitics | NCP leader Ajit Pawar takes oath as Maharashtra Minister in the presence of CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis pic.twitter.com/F58i9WvtJ0
— ANI (@ANI) July 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#MaharashtraPolitics | NCP leader Ajit Pawar takes oath as Maharashtra Minister in the presence of CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis pic.twitter.com/F58i9WvtJ0
— ANI (@ANI) July 2, 2023#MaharashtraPolitics | NCP leader Ajit Pawar takes oath as Maharashtra Minister in the presence of CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis pic.twitter.com/F58i9WvtJ0
— ANI (@ANI) July 2, 2023
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం ఏక్‌నాథ్ శిందేతో అజిత్ పవార్ సమావేశమయ్యారు. అప్పటినుంచే స్తబ్దుగా ఉన్న అజిత్ పవార్.. అకస్మాత్తుగా NDAలో చేరడం ఎన్సీపీలో కలకలం సృష్టించింది. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ పవార్‌కు 29 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు తెలిపారు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్కులే తెలిపారు. వీరింలో మొత్తం తొమ్మిది మంది NCP ఎమ్మెల్యేలు.. ఆదివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హాజరయ్యారు.
-
#WATCH | NCP leader Chhagan Bhujbal takes oath as Maharashtra Minister in the presence of CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis pic.twitter.com/f98odeMrFd
— ANI (@ANI) July 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | NCP leader Chhagan Bhujbal takes oath as Maharashtra Minister in the presence of CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis pic.twitter.com/f98odeMrFd
— ANI (@ANI) July 2, 2023#WATCH | NCP leader Chhagan Bhujbal takes oath as Maharashtra Minister in the presence of CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis pic.twitter.com/f98odeMrFd
— ANI (@ANI) July 2, 2023
రాజ్ భవన్ కు వెళ్లేముందు పార్టీ ఎమ్మెల్యేలతో తన నివాసంలో అజిత్ పవార్ భేటీ అయ్యారు. ఈ భేటీపై తనకు సమాచారం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొనడం గమనార్హం. ఈ భేటీకి శరద్‌పవార్ కుమార్తె, NCP కార్య నిర్వహక అధ్యక్షురాలు సుప్రియా సూలే కూడా హాజరయ్యారు. కానీ సమావేశం అనంతరం ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లలేదు.
-
#MaharashtraPolitics | NCP leader Dhananjay Munde takes oath as Maharashtra Minister pic.twitter.com/U6C2uQVOPt
— ANI (@ANI) July 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#MaharashtraPolitics | NCP leader Dhananjay Munde takes oath as Maharashtra Minister pic.twitter.com/U6C2uQVOPt
— ANI (@ANI) July 2, 2023#MaharashtraPolitics | NCP leader Dhananjay Munde takes oath as Maharashtra Minister pic.twitter.com/U6C2uQVOPt
— ANI (@ANI) July 2, 2023
ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌ను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. అప్పటి నుంచి అజిత్ పవార్ అసంతృప్తిగా ఉన్నారు. శరద్ పవార్ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాన్ని ప్రకటన చేసిన రోజు నుంచి అజిత్ పవార్ మీడియా ఎదుటకు రాలేదు. తర్వాత తాను సంతోషంగానే ఉన్నానని ప్రకటించినా.. ఏదో మూల అసంతృప్తితోనే ఉన్నారు. ఇదే అదనుగా ముఖ్యమంత్రి శిందే వర్గం పావులు కదిపి అజిత్ పవార్‌తో చేసిన సంప్రదింపులు ఫలించాయని దాని ఫలితంగానే ఈరోజు పార్టీలో చీలిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
'రాహుల్‌తో వేదిక పంచుకోవడం వల్లే'
ఇటీవల పట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో రాహుల్ గాంధీతో వేదిక పంచుకోవడం, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంపై.. శరద్ పవార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్లే కలత చెందామని అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు తెలిపారు. మరోవైపు.. ఎన్సీపీ అధ్యక్ష పదవి అప్పగిస్తారని అజిత్ ఆశించారు. అలా జరగకపోవడం వల్ల ఇలా తిరుగుబాటు చేసినట్లు సమాచారం.