ETV Bharat / bharat

రూ.1400 కోట్ల 'మ్యావ్ మ్యావ్' డ్రగ్స్ సీజ్.. కేరళలో 8వేల జిలెటిన్ స్టిక్స్

Meow Meow drug Mumbai: అక్రమంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను ముంబయి యాంటీ నార్కోటిక్ సెల్ అధికారులు అరెస్టు చేశారు. రూ.1400 కోట్లు విలువైన మత్తుపదార్థాలను సీజ్ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరోవైపు, కేరళలో 8వేల జిలెటిన్ స్టిక్స్ దొరకడం కలకలం రేపింది.

meow-meow-drug-mumbai
meow-meow-drug-mumbai
author img

By

Published : Aug 4, 2022, 1:13 PM IST

Meow Meow drug Mumbai: మహారాష్ట్ర ముంబయిలో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 704 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబయి క్రైమ్ బ్రాంచ్​కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. పాల్ఘర్ జిల్లాలోని నలసోపారా ప్రాంతంలో ఉన్న ఓ డ్రగ్ తయారీ కేంద్రంపై దాడులు చేసిన అధికారులు.. ఐదుగురిని అరెస్టు చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.1400 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

Meow Meow drug Mumbai
నిందితులతో పోలీసులు

Mumbai Anti drug operation: "మాకు ఈ డ్రగ్స్ గురించి విశ్వసనీయమైన సమాచారం అందింది. దీంతో తయారీ యూనిట్​పై సోదాలు జరిపాం. నిషేధిత మెఫెడ్రోన్ అనే డ్రగ్​ను తయారు చేస్తున్నట్లు ఏఎన్​సీ టీమ్ గుర్తించింది. నలసోపారాలో ఒకరిని, ముంబయిలో నలుగురిని అరెస్టు చేశాం" అని అధికారులు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో డ్రగ్స్ సీజ్ చేయడం ఇదే తొలిసారని చెప్పారు.
మెఫెడ్రోన్​ను 'మ్యావ్ మ్యావ్' డ్రగ్ అని పిలుస్తారు. దీనికి ఎండీ అనే మరో పేరు కూడా ఉంది. నార్కోటిక్ డ్రగ్స్ చట్టం ప్రకారం... డ్రగ్స్ సింథటిక్ సైకోట్రోఫిక్ మత్తుపదార్థాల కేటగిరీలో దీనిపై నిషేధం ఉంది.

Meow Meow drug Mumbai
మ్యావ్ మ్యావ్ డ్రగ్స్

8వేల జిలెటెన్ స్టిక్స్
Kerala gelatin sticks: మరోవైపు, కేరళలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు దొరకడం కలకలం రేపుతోంది. పాలక్కాడ్‌ జిల్లా షోర్‌నూర్ ప్రాంతంలోని ఒంగళ్లూరులో 8 వేల జిలెటిన్‌ స్టిక్స్‌ దొరికాయి. 40 పెట్టెల్లో ఉన్న 8 వేల జిలెటిన్‌ స్టిక్స్‌ను ఒక క్వారీ సమీపంలో వదిలేసి వెళ్లారు. క్వారీలో పేలుడు జరపడం కోసం తెచ్చి వాటిని వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. వాటిని గుర్తించిన పోలీసులు షోర్‌నూర్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

kerala gelatin sticks
జిలెటిన్ స్టిక్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.