Army helicopter crash: త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను పరిశోధించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు కోయంబత్తూరుకు చెందిన వై.జో అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ తీసిన వీడియోపై ఆరా తీస్తున్నారు.
ఈ కేసు విచారణలో భాగంగా జో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కోయంబత్తూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ వ్యక్తి తన స్నేహితులతో కలిసి కట్టేరి ప్రాంతంలో ఫొటోలు దిగేందుకు వెళ్లాడని గుర్తించారు. అయితే.. అటవీ జంతువుల సంచారం అధికంగా ఉండే ఈ జోన్ నిషేధిత ప్రాంతం. అయినప్పటికీ వీరంతా అక్కడికి ఎందుకు వెళ్లారనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు.
మరోవైపు.. ఘటన జరిగిన రోజు ఈ ప్రాంతంలోని వాతావరణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని చెన్నైలోని వాతావరణ శాఖను కోరింది పోలీసు శాఖ. ప్రమాదానికి గల కారణాలు సేకరించేందుకు ప్రత్యక్ష సాక్షులను సైతం ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి: