ETV Bharat / bharat

మణిపుర్​లో సామూహిక ఖననంపై హైకోర్టు స్టేటస్​ కో.. ప్రజలు బయటకు రాకుండా కర్ఫ్యూ - మణిపుర్​ అల్లర్లు వార్తలు

Manipur Violence High Court Order : మణిపుర్​ అల్లర్లలో చనిపోయిన కుకీ-జో ప్రజల సామూహిక ఖననంపై మణిపుర్ హైకోర్టు స్టేటస్​ కో విధించింది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థలతో పాటు ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, పశ్చిమ ఇంఫాల్​ జిల్లాలో సడలించిన ఆంక్షలను ఉపసంహరించుకుని.. పూర్తి స్థాయిలో కర్ఫ్యూ విధించారు.

Manipur Violence High Court Order
Manipur Violence High Court Order
author img

By

Published : Aug 3, 2023, 3:46 PM IST

Manipur Violence High Court Order : మణిపుర్‌ హింసలో ప్రాణాలు కోల్పోయిన.. కుకీ-జో ప్రజల సామూహిక ఖననం కోసం ప్రతిపాదించిన స్థలంపై.. మణిపుర్ హైకోర్టు స్టేటస్‌ కో విధించింది. ఈ మేరకు సామూహిక ఖనన స్థలంపై ఉదయం 6 గంటలకు అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు.. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 9కి వాయిదా వేసింది. వివాదాస్పద ఈ స్థలంలో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడితే మరింత హింస జరిగే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు, భద్రతా బలగాలతో పాటు ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విజ్ఞప్తి మేరకు 5 రోజులు అంత్యక్రియలు వాయిదా వేసినట్లు కుకి జోమి తెగ ప్రకటించింది. తమ ఐదు డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపింది.

Manipur Violence High Court Order
సామూహిక ఖనన స్థలం వద్ద ప్రజలు

అల్లర్లలో మృతి చెందిన 35మంది అంత్యక్రియలను సామూహికంగా నిర్వహించాలని కుకీ-జో తెగ నిర్ణయించింది. చురాచాంద్‌పుర్‌ జిల్లా హవోలై ఖోపి గ్రామంలో సామూహిక ఖననం చేయాలని భావించింది. ప్రతిపాదిత స్థలం గతంలో మైతేయిలు నివసించినదని ఆ వర్గం ప్రజలు చెబుతున్నారు. అక్కడ కొత్త శ్మశానం సృష్టించడం కవ్వించడమేనని ఆందోళన వ్యక్తంచేశారు. చనిపోయినవారిని వారి గ్రామాల్లో ఖననం చేయాలని మైతేయి సహా వివిధ సంఘాలు.. కుకి తెగవారిని కోరాయి. ఈ నేపథ్యంలో కోర్టు స్టేటస్​​ కో విధించింది.

Manipur Violence High Court Order
సామూహిక ఖనన స్థలం వద్ద ప్రజలు

ఆర్మీ టియర్​ గ్యాస్​ ప్రయోగం.. 17 మందికి గాయాలు..
బిష్ణుపుర్ జిల్లాలోని కాంగ్వాయ్​, ఫౌగక్యావో ప్రాంతంలో గురువారం ఆర్మీ, రాపిడ్ యాక్షన్ ఫోర్స్​-ఆర్​ఏఎఫ్​ సిబ్బంది టియర్​ గ్యాస్​ ప్రయోగించడం వల్ల 17 మంది గాయపడ్డారు. సామూహిక ఖననానికి ప్రదిపాదించిన స్థలం టుయిబువాంగ్​కు వెళ్లేందుకు భద్రతా సిబ్బంది నిరాకరించారు. దీనికి వ్యతిరేకిస్తూ భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన బారికేడ్​ను దాటి వెళ్లేందుకు మహిళల నేతృత్వంలోని స్థానికులు ప్రయత్నించారు. దీంతో భద్రతా బలగాలు టియర్​ గ్యాస్​ ప్రయోగించాయి. భద్రతా బలగాలను అడ్డుకునేందుకు వేలాది మంది వీధుల్లోకి రావడం వల్ల బిష్ణుపుర్​ జిల్లాలో ఉదయం నుంచి ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కర్ఫ్యూతో కట్టుదిట్టం..
Manipur Violence Curfew : పశ్చిమ ఇంఫాల్​ జిల్లాలో పూర్తి కర్ఫ్యూ విధించారు. ఆగస్టు 3న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సడలించిన కర్ఫ్యూను ఉపసంపరించుకున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. మెడికల్, పెట్రోల్ పంపులు, విద్యుత్,​ పాఠశాలలు / కళాశాలలు, మీడియా వంటి తదితర అత్యవసర సేవలకు చెందిన వ్యక్తులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.

  • Manipur | The total curfew which was relaxed from 05:00 am to 08:00 pm on August 3 in Imphal West District stands withdrawn. A total curfew is imposed in the district with immediate effect and restriction of movement of the general public outside their residences is enforced in… pic.twitter.com/fRuh98ytMY

    — ANI (@ANI) August 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.