ETV Bharat / bharat

కుక్కల వేటలో గాయపడిన వానరం-నోటితో శ్వాస అందించినా.. చివరకు - కోతిని రక్షించిన వ్యక్తి

Man Saves Monkey: కుక్కల వేటలో గాయపడిన కోతిని రక్షించే ప్రయత్నం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు తమిళనాడుకు చెందిన వ్యక్తి. శ్వాస తీసుకునే పరిస్థితిలో లేని కోతికి తన నోటితో శ్వాసను అందించి దాని ప్రాణాన్ని నిలిపాడు. కానీ చికిత్స అందిస్తున్న క్రమంలో ఆ వానరం ప్రాణాలు కోల్పోయింది.

monkey rescue
గాయపడిన వానరాన్ని రక్షించిన వ్యక్తి
author img

By

Published : Dec 14, 2021, 2:25 PM IST

Updated : Dec 14, 2021, 10:03 PM IST

కుక్కల వేటలో గాయపడి వానరం-నోటితో శ్వాస అందించినా..

Man Saves Monkey: ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోతిని రక్షించాడు తమిళనాడుకు చెందిన వ్యక్తి. కుక్కల వేటలో గాయపడి శ్వాసతీసుకోలేని స్థితిలో ఉన్న వానరానికి తన నోటితో శ్వాస అందించి దాని ప్రాణాన్ని నిలిపేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది. అయితే ఈ కోతి చికిత్స పొందుతూ మృతిచెందింది.

చికిత్స అందించినా..

పెరంబలూర్​ జిల్లాలోని సామంతువపురంలో ప్రభు(42) నివసిస్తున్నాడు. తన ఇంటి ప్రాంగణంలో ఓ కోతిని వీధికుక్కలు వెంబడించాయి. ఈ ఘటనలో కోతి తీవ్రంగా గాయపడింది. ప్రాణాపాయ స్థితిలో ఓ చెట్టుకొమ్మను ఎక్కి తలదాచుకుంది. ఇది గమనించిన ప్రభు కుక్కలను పారదోలి.. కోతిని రక్షించాడు. జంతు వైద్యుని వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించాడు. ప్రభు దయార్థ హృదయం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కానీ కుక్కల దాడికి తీవ్రంగా గాయపడిన కోతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

ఇదీ చదవండి: Tigress Sultana: రోడ్డుపై 'సుల్తానా' చక్కర్లు- పర్యటకులు థ్రిల్​

Last Updated : Dec 14, 2021, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.