ETV Bharat / bharat

ఒకరితో నిశ్చితార్థం.. మరొకరితో ప్రేమ​.. ఇద్దరు బిడ్డలు పుట్టాక ఒకే వేదికపై పెళ్లి - ఛత్తీస్​గఢ్​ అరుదైన వివాహం

అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోవటం సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో ఒకే వ్యక్తి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న సంఘటనలూ ఇటీవల జరిగాయి. అయితే.. ఓ వ్యక్తి ఇద్దరు యువతులను ప్రేమించి.. వారితో ఇద్దరు పిల్లలను కన్న తర్వాత ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న అరుదైన సంఘటన ఛత్తీస్​గఢ్​, బస్తర్​ జిల్లాలో జరిగింది.

Man marries two girlfriends
ఒకే వేదికపై ఇద్దరితో వివాహం
author img

By

Published : Jun 11, 2022, 10:20 AM IST

ఒకే వేదికపై ఇద్దరితో పెళ్లి

వివాహ మండపంలో వరుడి పక్కన ఇద్దరు వధువులు కూర్చున్నారు. వారి ఒళ్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ చిన్నారులు వారికి తోడుగా కూర్చున్నారనుకుంటే పొరబడినట్లే. ఆ పిల్లలు వారి బిడ్డలే. పిల్లలు ఉన్న వారిని పెళ్లి చేసుకోవటమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ ఇది నిజమే. ఆ పిల్లల తండ్రీ ఆ వరుడే. ఇద్దరు యువతులను ప్రేమించి.. వారితో ఇద్దరు పిల్లలను కన్న తర్వాత ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న ఈ అరుదైన సంఘటన ఛత్తీస్​గఢ్​, బస్తర్​ జిల్లాలో జరిగింది.

Man marries two girlfriends
బిడ్డలతో పెళ్లి వేదికపై వధువులు

ఇదీ జరిగింది: కేశ్​కాల్​ ప్రాంతంలోని ఉమ్లా గ్రామానికి చెందిన రంజన్​ సింగ్​ సలామ్​తో ఆండేగా గ్రామానికి చెందిన దుర్గేశ్వరీ మార్కమ్​ అనే యువతితో ముందుగా నిశ్చితార్థం అయింది. ఆ తర్వాత దుర్గేశ్వరి రంజన్​ సింగ్​ ఇంటికి వచ్చి ఉంటోంది. కొద్ది నెలల తర్వాత ఆమె ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే.. ఆ తర్వాత కొద్ది రోజులకు అంవరీ గ్రామానికి చెందిన సన్నో బాయి గోటా అనే యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలోనే సన్నో గర్భం దాల్చింది. ఆమె సైతం ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు రంజన్​ సింగ్​ కుటుంబంతో మాట్లాడారు. గ్రామంలో పంచాయతీ సైతం నిర్వహించారు. ఇద్దరు యువతులు రంజన్​ సింగ్​ను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు. అందుకు పెద్దలు సైతం ఒప్పుకోవటం వల్ల ఒకే వేదికపై ఈనెల 8న ఇద్దరిని వివాహం చేసుకున్నాడు రంజన్​ సింగ్​.

marriageMan marries two girlfriends
వివాహ ఆహ్వాన పత్రిక

ఇరువురి కుటుంబాలు, పెద్దల అంగీకారంతోనే ఆహ్వాన పత్రికలు ముద్రించామని తెలిపారు గిరిజన సమాజం ఉపాధ్యక్షుడు సోనూరామ్​ మండావీ. వాటిల్లో ఇద్దరు యువతుల పేర్లు పెట్టినట్లు చెప్పారు. ఈ వివాహ తంతును చూసేందుకు ఉమ్లా గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు సైతం తరలివచ్చారు.

ఇదీ చూడండి: పక్షిని కాపాడేందుకు వెళ్లి ఇద్దరు మృతి.. లైవ్​ వీడియో!

ఆసుపత్రి నిర్లక్ష్యం.. ఒకరి శిశువు మరొకరికి.. మూడేళ్ల తర్వాత ఏమైందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.