ETV Bharat / bharat

జూదంలో భార్యను ఓడిన వ్యక్తి.. ఇతరులతో శారీరక సంబంధానికి ఒత్తిడి - జూదంలో భార్యను పందెం

man gambling on wife: జూదంలో భార్యను పందెంగా పెట్టాడు ఓ వ్యక్తి. ఆటలో ఓడిపోయి.. ఆమెను ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడు. మరోవైపు, రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మహిళ.. 70 ఏళ్ల కార్డియాలజిస్ట్​ను మోసం చేసింది. రూ.1.80 కోట్లు కాజేసింది.

man gambling on wife
man gambling on wife
author img

By

Published : Jun 20, 2022, 5:38 PM IST

జూదంలో భార్యను పందెంగా పెట్టి ఓడిపోయాడు ఓ వ్యక్తి. ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని లక్సర్​లో ఈ ఘటన జరిగింది. జూదానికి అలవాటు పడి తనను పందెంగా పెట్టాడని తన భర్తపై ఆరోపణలు చేశారు బాధిత మహిళ. అందులో ఓడిపోవడం వల్ల తనను ఇతరులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసినట్లు తెలిపారు. దీనిపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

కొత్వాలి ప్రాంతంలో నివసించే ఓ మహిళకు 2021 మార్చిలో ఆసిఫ్​తో పెళ్లి అయింది. ముస్లిం సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహం కోసం ఆ మహిళ కుటుంబ సభ్యులు భారీగా ఖర్చు చేశారు. రూ.ఏడు లక్షలు కట్నం ఇచ్చారు. బంగారు, వెండి ఆభరణాలు, బైక్​ కొనిచ్చారు. అయినప్పటికీ ఆసిఫ్ కుటుంబం సంతృప్తి చెందలేదు.

కారు కొనివ్వాలని ఆమెను వేధించారు. క్రమంగా వేధింపులు ఎక్కువయ్యాయి. బాధితురాలి భర్తకు డ్రగ్స్ అలవాటు ఉంది. జూదం ఆడేవాడు. రోజూ తాగొచ్చి డబ్బుల కోసం గొడవ చేసేవాడు. 2021 నవంబర్​లో డ్రగ్స్ తీసుకొని తనతో అసహజ శృంగారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపించారు. తన పరిస్థితిని ఆసరాగా తీసుకొని భర్త సోదరుడు షకీబ్.. తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని మహిళ పేర్కొన్నారు. వీటిపై తన పుట్టింట్లో ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోలేదని తెలిపారు. ఇదే క్రమంలో ఓ రోజు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల్ని తన భర్త వెంట తీసుకొచ్చాడని.. జూదంలో ఓడిపోయినందున వారితో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడని ఆరోపించారు. దీనికి నిరాకరించినందుకు భర్త తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని మహిళ తెలిపింది. తనకు న్యాయసహాయం అందించాలని అభ్యర్థించింది.

రూ.1.80 కోట్లు కాజేసి...
మరోవైపు.. రెండో పెళ్లి చేసుకోవాలన్న 70ఏళ్ల వ్యక్తికి.. ఓ మహిళ షాక్ ఇచ్చింది. రూ.1.80 కోట్లు తన ఖాతాలోకి బదిలీ చేయించుకొని పరార్ అయింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్ రాజధాని లఖ్​నవూలో జరిగింది. కార్డియాలజిస్ట్​గా పనిచేసే బాధితుడు భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. రెండో పెళ్లి చేసుకుందామని భావించి న్యూస్​పేపర్​లో యాడ్ ఇచ్చాడు. చాలా ప్రపోజల్స్ వచ్చాయి.

కానీ, 40ఏళ్ల కృష్ణ శర్మపై అతడు మనసు పారేసుకున్నాడు. ఆమెకు తరచుగా కాల్స్ చేయడం, మాట్లాడుకోవడం వంటివి కొనసాగించాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నానని చెప్పి మహిళ అతడికి దగ్గరైంది. మెరైన్ ఇంజినీర్​గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకుంది. విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తున్నానని తెలిపింది.

ఓ పనిలో భాగంగా కార్గో షిప్​లో ముంబయికి వస్తున్నానని కార్డియాలజిస్ట్​కు చెప్పింది. అక్కడి నుంచి లఖ్​నవూకు వచ్చి కలుస్తానని ఆశ పెట్టింది. ఏడేళ్లుగా షిప్పింగ్ కంపెనీలో జాబ్ చేస్తున్నానని.. ఇకపై దాన్ని వదిలేసి వ్యాపారం చేస్తానని కార్డియాలజిస్ట్​ను నమ్మించింది. ఆ తర్వాత భారత్​లోనే ఉంటానని చెప్పింది. కార్గో షిప్​ ప్రయాణంలో సముద్ర దొంగల భయం ఎక్కువగా ఉంటుందని.. అందువల్ల రూ.7లక్షల బంగారాన్ని అమెరికా నుంచి లఖ్​నవూ అడ్రెస్​కు పంపిస్తున్నానని చెప్పింది. దాన్ని తీసుకోవాలని సూచించింది.

కొరియర్ కంపెనీ వివరాలన్నీ ఇచ్చింది మహిళ. వారిని కార్డియాలజిస్ట్ సంప్రదించగా.. కస్టమ్స్ డ్యూటీ, పర్మిషన్ ఫీజు వంటి రుసుములు చెల్లించాలని చెప్పారు. ఇలా రూ.1.80 కోట్లు కట్టించుకున్నారు. చివరకు పేమెంట్ అయిపోయిన తర్వాత కృష్ణ శర్మ ఫోన్ తీయడం మానేసింది. మోసపోయానని డాక్టర్​కు అనుమానం వచ్చింది. వెంటనే లఖ్​నవూలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.