ETV Bharat / bharat

'నా భార్యను లక్ష రూపాయలకు అమ్మేశాడు.. న్యాయం చేయండి'

author img

By

Published : Apr 18, 2022, 10:52 PM IST

Man alleges his wife sold: తన భార్య పొరుగింటి వ్యక్తి లక్ష రూపాయాలకు అమ్మేశాడంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించిన సంఘటన ఉత్తర్​ప్రదేశ్​, ముజఫర్​నగర్​ జిల్లాలో జరిగింది. తన భార్య అందంగా ఉంటుందని, చదువుకుందని.. అందుకే విక్రయించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Man alleges his wife sold
భార్యను పొరుగు వారు అమ్మేశారని ఫిర్యాదు

Man alleges his wife sold: ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. తన భార్యను పొరుగింటి వ్యక్తి రూ.1 లక్షకు అమ్మేశాడని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అయితే.. జన్​సత్​ పోలీసుల విచారణలో ఫిర్యాదుదారు చెప్పిందంతా అబద్ధని తేలింది. తన భార్యపై కోపంతోనే ఇలా చేస్తున్నాడని పోలీసులు తేల్చారు. ఆమే చదువుకుందని, తన సొంత నిర్ణయంతోనే ఫిర్యాదు దారుడికి దూరంగా వెళ్లిపోయిందని పేర్కొన్నారు.

పోలీసులను తప్పుదారి పట్టించినందుకు ఫిర్యాదుదారుతో పాటు పొరుగింటి వ్యక్తికి జరిమానా విధించారు. అంతకుముందు సదరు వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పొరుగువారితో గొడవకు దిగాడు. 'నా భార్య చాలా అందంగా ఉంటుంది, చదువుకున్నది కాబట్టే నా పొరుగువారు ఆమెను డబ్బులకు అమ్మేశార'ని ఫిర్యాదు పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: కాబోయే భర్తకు సర్ ప్రైజ్ అంటూ కళ్లకు గంతలు కట్టింది.. కత్తితో గొంతు కోసి పరారైంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.