ETV Bharat / bharat

స్టాలిన్‌తో మమత భేటీ.. 'రాజకీయాలే కాదు అంతకు మించి మాట్లాడాం' - మమతా బెనర్జీ స్టాలిన్​ మీటింగ్

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమిళనాడు సీఎం స్టాలిన్​తో భేటీ అయ్యారు. ఈ భేటీలో స్టాలిన్​తో చర్చించిన విషయాలపై మమత క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే..

mamata banerjee stalin meeting
mamata banerjee stalin meeting
author img

By

Published : Nov 3, 2022, 7:28 AM IST

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ఆయన నివాసంలో బుధవారం భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాలు పాటు వీరు సమావేశం అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శుభకార్యానికి హాజరయ్యేందుకు తమిళనాడుకు వచ్చానని, అందులో భాగంగానే తనకు సోదర సమానుడైన స్టాలిన్‌తో భేటీ అయ్యానని చెప్పారు. తమ భేటీలో రాజకీయాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని మమత తెలిపారు.

"స్టాలిన్‌ నా సోదరుడు లాంటి వారు. ఇక్కడో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చా. అందులో భాగంగానే స్టాలిన్‌ను కలిశా. అయినా ఇద్దరు రాజకీయ నేతలు కలిసినప్పుడు రాజకీయాలే కాదు.. ఇతర విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. మేమైతే రాజకీయాలను మించిన పెద్ద విషయాలే మాట్లాడుకున్నాం" అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు మమత సమాధానం ఇచ్చారు. ఈ భేటీపై స్టాలిన్‌ సైతం స్పందించారు. మర్యాదపూర్వకంగానే మమత భేటీ అయ్యారని తెలిపారు. తమ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదని, కోల్‌కతాకు మమత తనను ఆహ్వానించారని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయన్న క్రమంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, అలాంటిదేమీ లేదని నేతలిద్దరూ పేర్కొన్నారు.

ఇవీ చదవండి : భాజపా ఎమ్మెల్యేకు 'వలపు వల'.. వాట్సాప్​లో న్యూడ్ వీడియో​ కాల్​!

'మా ఆవిడ నన్ను కొడుతోంది.. కేసు పెట్టొచ్చా?'.. ప్రధాని మోదీకి ఓ భర్త రిక్వెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.