ETV Bharat / bharat

మహిళా డాక్టర్​పై నర్స్​ రేప్​.. సోషల్​ మీడియాలో నగ్న ఫొటోలు - Rape Crime Latest News

తాను పనిచేస్తున్న ఆస్పత్రిలోని మహిళా వైద్యురాలిని అత్యాచారం చేశాడు ఓ మేల్ నర్స్​. అంతటితో ఆగకుండా ఆమె నగ్న​ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్​ చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మరోవైపు 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన 45 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు మహారాష్ట్ర పోలీసులు.

Rape Crime Latest News
రేప్​ క్రైమ్ తాజా వార్తలు
author img

By

Published : Mar 2, 2023, 6:37 PM IST

కర్ణాటకలో దారుణం జరిగింది. తాను పని చేస్తున్న ఆస్పత్రిలోని మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు 24 ఏళ్ల పురుష​ నర్స్​. అంతటితో ఆగకుండా ఆమె నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశాడు. గతేడాది డిసెంబరులో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది.

పోలీసుల వివరాలు..
కేరళ త్రిస్సూర్​కు చెందిన 24 ఏళ్ల నిషామ్​ బాబు కర్ణాటకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో 28 ఏళ్ల మహిళా వైద్యురాలు కొత్త ఉద్యోగ అన్వేషణలో భాగంగా నిషామ్​ పని చేసే ఆస్పత్రికి వచ్చింది. దీంతో ఆమెకు ఎలాగైనా ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. వైద్యురాలిని ఓ హోటల్​కు తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె నగ్న​ ఫొటోలను తన ఫోన్​ కెమెరాలో బంధించాడు. తాను చెప్పినట్లు చేయకుంటే వీటిని సోషల్​ మీడియాలో షేర్​ చేస్తానని బెదిరించి పలు మార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విసుగు చెందిన బాధితురాలు నిందితుడి ఫోన్​ నంబర్​ను బ్లాక్​ లిస్ట్​లో పెట్టింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న అతడు ఆమె నగ్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

10 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి హత్యాచారం..
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన 45 ఏళ్ల ఓ వ్యక్తి 10 ఏళ్ల బాలికను కిడ్నాప్​ చేసి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని గుజరాత్‌కు తీసుకెళ్లి పడేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
తలసరి గ్రామానికి చెందిన బాధిత బాలిక బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడం వల్ల ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందుతుడిని పట్టుకునేందుకు నాలుగు పోలీస్​ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో బాలిక బంధువుల్లోని 45 ఏళ్ల వ్యక్తపై అనుమానం రావడం వల్ల అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. విచారణలో నిందితుడు బాలికను తలసరి గ్రామం నుంచి కిడ్నాప్​ చేసి గుజరాత్​లోని సంజన్​ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు చెప్పాడు. అనంతరం హత్య చేసి ఆపై బాలిక మృతదేహాన్ని అడవిలో పడేసినట్లుగా ఒప్పుకున్నాడని పోలీస్​ అధికారి సచిన్ నవాద్కర్ తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పాల్ఘర్​ జిల్లా పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి పంపించారు.

దివ్యాంగుడని చంపేసింది..
రాజస్థాన్​ కోటా నగరంలోని ఆదర్శిల సమీపంలో ఉన్న నదిలో 4 ఏళ్ల చిన్నారి మృతదేహం లభించిన కేసులో ఆమె తల్లిని అరెస్టు చేశారు పోలీసులు. కోటా-దాదాబరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. గతనెల 28న చంబా నదిలో మానసిక దివ్యాంగుడైన తన నాలుగేళ్ల కుమారుడిని నీటిలో ముంచి హత్య చేసింది మధ్యప్రదేశ్​కు చెందిన ఓ తల్లి. ఈమె రాజస్థాన్​లోని బరన్​ జిల్లాకు వలస వచ్చి జీవనం సాగిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో మహిళను అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లుగా కోటా నగర ఎస్పీ శరద్ చౌదరి తెలిపారు. తన కుమారుడిని నదిలో పడేసే సమయంలో నిందితురాలి చేతిలో తన 6 నెలల చిన్నారి కుడా ఉందని స్థానికులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.