ETV Bharat / bharat

'రైతు నిరసనలతో బెంగళూరు మరో దిల్లీ కావాలి' - శివమొగ్గ రైతు సభలో టికాయత్

దిల్లీలో మాదిరిగానే కర్ణాటకలోనూ రైతులు నిరసనలు చేపట్టాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ పిలుపునిచ్చారు. బెంగళూరును అన్ని వైపుల ట్రాక్టర్లతో ముట్టడించాలని అన్నారు. శివమొగ్గ రైతు సభకు హాజరైన టికాయిత్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

Make 'Delhi' in Bengaluru gherao city from all sides says Tikait
'దిల్లీ మాదిరిగానే బెంగుళూరులో రైతు నిరసన చేపట్టాలి'
author img

By

Published : Mar 21, 2021, 8:36 AM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతుల నిరసన జరుగుతున్న మాదిరిగానే కర్ణాటకలోనూ రైతులు ఆందోళన చేపట్టాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ పిలుపునిచ్చారు. బెంగళూరును అన్నివైపుల నుంచి ముట్టడించాలని కోరారు. శివమొగ్గలోని రైతుల సభకు హాజరైన టికాయిత్.. రైతు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలన్నారు.

Make 'Delhi' in Bengaluru gherao city from all sides says Tikait
రైతుల సభకు హాజరైన టికాయిత్

"దిల్లీలో లక్షల మంది నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. సాగు చట్టాల రద్దు జరిగే వరకూ అన్ని రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టాలి. కర్ణాటకలోనూ రైతులు నిరసనకు సిద్ధమవ్వండి. మీ భూమిని లాగేసుకునేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. కొత్త చట్టాలతో వ్యవసాయం కార్పొరేట్​ గుప్పిట్లేనే ఉండబోతోంది."

- రాకేశ్ టికాయిత్, బీకేయూ నేత

రైతుల నిరసనలు జరగకపోయుంటే దేశం అమ్ముడుపోయుండేదని టికాయిత్ ఆరోపించారు. వచ్చే 20 ఏళ్లలో అందరి భూముల్నీ ప్రభుత్వం లాగేస్తుందని అన్నారు. బెంగళూరును ట్రాక్టర్లతో ముట్టడించాలని పిలుపునిచ్చారు.

రైతుల సభ

ఇదీ చదవండి:18 మందిని పెళ్లాడి.. నగలతో పరారీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.