ETV Bharat / bharat

మకరంలో సూర్యుని సంచారం - ఆ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

Makar Sankranti Sun Transit In Capricorn In 15th January 2024 In Telugu : నేడు సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించాడు. అందుకే దీనిని మకర సంక్రమణం అంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం నేటితోనే ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మనందరి రాశి ఫలాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

మకర సంక్రమణం రాశి ఫలాలు
Sun Transit in Capricorn
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 4:54 AM IST

Makar Sankranti Sun Transit In Capricorn In 15th January 2024 : సహస్ర కిరణుడైన సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే మహత్తర పుణ్య దినమే మకర సంక్రాంతి. ఈ శుభ సమయాన మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి మకర సంక్రాంతి తరువాత కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది.

పరిహారం - శివునికి జలాభిషేకం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి.

.

వృషభం (Taurus) : సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత వృషభ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. అయితే విజయం అంత తేలికగా రాదు. బాగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

పరిహారం – ప్రతిరోజూ సూర్య భగవానుడికి కుంకుమ కలిపిన నీటిని సమర్పించాలి.

.

మిథునం (Gemini) : సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. మీ ప్రయాణాలు సులువుగా జరుగుతాయి. కానీ మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బయటి ఆహార, పానీయాలకు దూరంగా ఉండడం మంచిది.

పరిహారం - సూర్య భగవానుని పవిత్ర మంత్రాలను జపించాలి.

.

కర్కాటకం (Cancer) : సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత కర్కాటక రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు అధికం అయ్యే సూచనలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు.

పరిహారం - ప్రతిరోజూ సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి.

.

సింహం (Leo) : సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత సింహ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. మీ శత్రువు పక్షం బలహీనం అవుతుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ వ్యయాలను అదుపు చేయడం కష్టమవుతుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగం మారడానికి ఆసక్తి చూపిస్తారు.

పరిహారం - రోజూ సూర్య నమస్కారాలు చేయాలి.

.

కన్య (Virgo) : సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత కన్య రాశివారికి ఒక నెల వరకు మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగులకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. మీ పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు.

పరిహారం - శివున్ని పూజించాలి.

.

తుల (Libra) : తులారాశి వారికి మకర సంక్రాంతి తరువాత ఒక నెల వరకు కాస్త కష్టంగా ఉంటుంది. ఏ వైపునకు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉంటారు. ఈ సమయంలో భూ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. తెలివిగా పెట్టుబడులు పెట్టాలి.

పరిహారం - గోమాతకు ప్రతిరోజూ బెల్లం తినిపించాలి.

.

వృశ్చికం (Scorpio) : సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత వృశ్చిక రాశివారికి ఒక నెల వరకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అన్నదమ్ములతో అభిప్రాయ భేదాలు రావచ్చు. తండ్రి లేదా తాత ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. పని ప్రదేశంలో విశ్వాసంగా ఉంటారు.

పరిహారం - అవసరం ఉన్నవారికి గోధుమలను దానం చేయడం మంచిది.

.

ధనుస్సు (Sagittarius) : సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత ధనుస్సు రాశివారికి సాధారణ ఫలితాలే లభిస్తాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆర్థిక విషయాలలో మాత్రం మీకు మంచి జరుగుతుంది. పెట్టుబడులపై మీ దృష్టిని కేంద్రీకరిస్తారు. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది.

పరిహారం - ప్రతిరోజూ సూర్యదేవుని మంత్రాలు జపించాలి.

.

మకరం (Capricorn) : సూర్యుడు ఇప్పుడు మకర రాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీకు అంతులేని ఆత్మవిశ్వాసాన్ని, అహంకారం కలిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో సంబంధాలు క్షీణించవచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి.

పరిహారం - రోజూ మీ తండ్రి ఆశీస్సులు తీసుకోవాలి.

.

కుంభం (Aquarius) : సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత కుంభ రాశివారికి అంతా మంచే జరుగుతుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది.

పరిహారం - మీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి.

.

మీనం (Pisces) : సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత మీన రాశివారి పరిస్థితులు సాధారణంగా కంటే మెరుగ్గా ఉంటాయి. ఈ కాలంలో మీ ఆదాయం బాగా పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంబంధించిన ఆందోళనలు తొలగుతాయి. అయితే అహంకారాన్ని విడిచిపెట్టాలి.

పరిహారం - ఆదిత్య హృదయాన్ని పఠించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.