ETV Bharat / bharat

నడిరోడ్డుపై రణరంగం- ఏసీపీ వేళ్లు నరికేసిన వ్యాపారులు - తెగిపడిన ఏసీపీ చేతి వేళ్లు

రహదారిపై అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నవారిని ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై చిరు వ్యాపారులు(Peddler) దాడి చేశారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ చేతి మూడు వేళ్లు తెగిపోయాయి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

peddler attacked an acp in thane
ఏసీపీపై వ్యాపారుల దాడి
author img

By

Published : Aug 31, 2021, 10:57 AM IST

Updated : Aug 31, 2021, 12:50 PM IST

మహారాష్ట్ర ఠాణెలో చిరు వ్యాపారులు బీభత్సం సృష్టించారు. పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో మాజివడా అసిస్టెంట్​ పోలీసు కమిషనర్ కల్పితా పింపుల్​​ చేతి మూడు వేళ్లు తెగిపడిపోయాయి.

ఏం జరిగింది?

కొద్ది రోజులుగా.. అక్రమంగా దుకాణాలు ఏర్పరచుకున్న వీధి వ్యాపారులపై ఠాణె మున్సిపల్​ కార్పొరేషన్​ చర్యలు చేపట్టింది. మున్సిపల్​ కమిషనర్​ డాక్టర్​ విపిన్ శర్మ ఆదేశాలతో దుకాణాలను, తోపుడు బండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఘోడ్​బందర్​ రోడ్డులో సోమవారం సాయంత్రం ఇదే తరహాలో వ్యాపారులను ఖాళీ చేయించడానికి అధికారులు చేరుకోగా.. వారి మధ్య ఘర్షణ తలెత్తింది.

peddlers  attack on police
వ్యాపారుల దాడితో తెగిపడిన ఏసీపీ చేతి వేలు
peddlers  attack on police
తెగిపడిన చేతి వేలు
peddlers  attack on police
ఆస్పత్రిలో ఏసీపీ కల్పితా పింపుల్​

ఈ క్రమంలో ఏసీపీ కల్పితా పింపుల్​పై కూరగాయల వ్యాపారి అమర్జీత్​ యాదవ్​ దాడి చేశాడు. దీంతో కల్పితా పింపుల్​ మూడు వేళ్లు తెగిపడ్డాయి. ఏసీపీని హుటాహుటిన ఘోడ్​బందర్​లోని ప్రైవేట్​ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఏసీపీ పక్కన ఉన్న సెక్యూరీటీ గార్డు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దాడి అనంతరం వీధి వ్యాపారులు పెద్దఎత్తున రహదారిపైకి చేరుకున్నారు.

peddlers  attack on police
ఠాణె ఘోడ్​బందర్​లో పోలీసులతో చిరు వ్యాపారుల ఘర్షణ

కఠిన చర్యలు తీసుకుంటాం..

ఏసీపీపై దాడి కేసులో నిందితుడు అమర్జీత్​ యాదవ్​ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్యాయత్నం కేసు సహా ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించాడన్న అభియోగం కింద కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్​ వినయ్​ రాఠోడ్​ తెలిపారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో ఠాణె మున్సిపల్​ కార్పొరేషన్ అధికారుల భద్రతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి: jeevitham foundation: వందలాది అభాగ్యులకు 24ఏళ్ల యువతే 'అమ్మ'

ఇదీ చూడండి: Assam Flood: పోటెత్తిన వరదలు- 950 గ్రామాలు జలదిగ్బంధం

Last Updated : Aug 31, 2021, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.