ETV Bharat / bharat

కొవిడ్ పంజా-'మహా'లో కొత్తగా 59వేల కేసులు - దిల్లీలో కొవిడ్ కేసులు

దేశంలో వైరస్​ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, దిల్లీ, ఛత్తీస్​గఢ్​, తమిళనాడులో వైరస్​ కోరలు చాస్తోంది. మహారాష్ట్రలో కొత్తగా 58వేల మందికి పైగా వైరస్​ సోకగా.. ఛత్తీస్​గఢ్​లో 14,250 మందికి పాజిటివ్​గా తేలింది.

covid cases in states
కొవిడ్ పంజా-'మహా'లో కొత్తగా 58వేల మందికి వైరస్
author img

By

Published : Apr 14, 2021, 11:17 PM IST

మహారాష్ట్రలో కొవిడ్​-19 విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 58,952 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 35,78,160కి చేరింది. మరో 278 మంది వైరస్​కు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,12,070 యాక్టివ్​ కేసులున్నాయి.

ముంబయి, నాగ్​పూర్, పుణె వంటి నగరాల్లో వైరస్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. ముంబయిలో తాజాగా 9,925 కేసులు నమోదుకాగా.. 54 మంది మృతిచెందారు. నాగ్​పూర్​లో 5,993 కేసులు నమోదయ్యాయి.

ఛత్తీస్​గఢ్​లో కొవిడ్ ఉద్ధృతి..

ఛత్తీస్​గఢ్​లో కొత్తగా 14,250 మందికి కొవిడ్ సోకింది. ఈ రాష్ట్రంలో వైరస్​ కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. కొత్తగా 73 మంది వైరస్​కు బలయ్యారు. 1,18,636 యాక్టివ్ కేసులున్నాయి.

దిల్లీలో..

దేశరాజధాని దిల్లీలోను కరోనా వ్యాప్తి తీవ్రమవుతుంది. ఒక్కరోజే 17,282 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 7,67,438కి చేరింది. మరో 104మంది మృతి చెందారు.

కర్ణాటకలో వైరస్ పంజా..

కర్ణాటకలో 11265 మందికి వైరస్ సోకింది. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85,480 యాక్టివ్ కేసులున్నాయి.

గుజరాత్​లో..

గుజరాత్​లో 7,410 కొత్త కేసులు నమోదయ్యాయి. 73 మంది వైరస్ కారణంగా మృతిచెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 39,250 క్రియాశీల కేసులున్నాయి.

తమిళనాడులో..

తమిళనాడులోనూ కొవిడ్​ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. తాజాగా 7,819 మందికి పాజిటివ్ అని తేలగా.. 25 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 9,54,948కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 54,315గా ఉంది.

ఇదీ చదవండి:'దేశాల మధ్య సహకారంతో ప్రచ్ఛన్న యుద్దానికి ముగింపు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.