ETV Bharat / bharat

'శరద్​ పవార్ తగ్గేదేలే.. ఈ సర్కస్ ఎక్కువ కాలం నిలవదు!' - అజిత్ పవార్ బీజేపీ

Maharashtra Political Crisis : మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్​సీపీ కీలక నేత అజిత్​ పవార్.. ఎన్​డీఏలో చేరి, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడంపై శివసేన(యూబీటీ), ఎన్​సీపీ మండిపడ్డాయి. ఎన్​సీపీ నాయకులు పార్టీ అధినేత శరద్ పవార్ వెంటే ఉన్నారని అన్నారు ఎన్​సీపీ అధికార ప్రతినిధి మహేశ్ భరత్​. మరోవైపు.. బీజేపీ-శివసేన(శిందే వర్గం)- ఎన్​సీపీ(అజిత్ పవార్ వర్గం).. కూటమిని సర్కస్​గా అభివర్ణించారు సంజయ్​ రౌత్​.

maharashtra political crisis
maharashtra political crisis
author img

By

Published : Jul 2, 2023, 4:03 PM IST

Updated : Jul 2, 2023, 6:33 PM IST

Ajit Pawar Joins NDA : ఎన్​సీపీ కీలక నేత అజిత్ పవార్​ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి మహేశ్ భరత్ తపసే స్పందించారు. ఎన్​సీపీ నాయకులు చాలా మంది శరద్​ పవార్​తోనే ఉన్నారని ఆయన చెప్పారు. రాజ్​భవన్​లో ఎన్​సీపీ నాయకులు చేసిన ప్రమాణ స్వీకారాన్ని తాము గుర్తించమని అన్నారు.

  • VIDEO | "Most of the NCP leaders are with Sharad Pawar. We won't recognise the oath-taking ceremony that took place at Raj Bhavan," says NCP spokesperson Mahesh Bharet Tapase on NCP leader Ajit Pawar taking oath as Deputy CM of Maharashtra. pic.twitter.com/7CtRgW2fkH

    — Press Trust of India (@PTI_News) July 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బీజేపీకి కర్ణాటక ఫలితాలే 'మహా'లో కూడా రిపీట్​'
మరోవైపు ఇప్పటకిప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే.. బీజేపీకి కర్ణాటక ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ అన్నారు. మహారాష్ట్రలో గెలవాలంటే ఎన్‌సీపీని చీల్చడం తప్ప బీజేపీకి వేరే మార్గం లేదని విమర్శించారు. ఎన్​సీపీని.. బీజేపీ చీలుస్తుందని తమకు ఎప్పుడో తెలుసని చెప్పారు. బీజేపీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందని సావంత్ విమర్శించారు.

  • VIDEO | "This was bound to happen. The BJP was well aware that if elections are held today in Maharashtra, they will have the same fate as Karnataka. They had no other option left rather than to break the party (NCP). People of Maharashtra have identified the real face of the… pic.twitter.com/X1zeH53244

'సర్కస్​ ఎక్కువ కాలం ఉండదు'
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై శివసేన(యూబీటీ) వర్గం నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ఎన్​సీపీ చీలికతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్​ అధైర్యపడలేదని చెప్పారు. ఎన్​డీఏలో అజిత్​ పవార్ చేరడంపై స్పందిస్తూ.. ఈ సర్కస్​ ఎక్కువ కాలం ఉండదని ఎద్దేవా చేశారు.

  • महाराष्ट्राच्या राजकारणाचे साफ मातेरे करण्याचां विडा काही लोकांनी उचलला आहे.त्यांना त्यांच्या मार्गाने जाऊ द्या.
    माझे आताच श्री.शरद पवार यांच्याशी बोलणे झाले.ते म्हणाले" मी खंबीर आहे.लोकांचा पाठिंबा आपल्याला आहे. उद्धव ठाकरें सह पुन्हा सर्व नव्याने उभे करू.". होय,जनता हे खेळ फार… pic.twitter.com/fsBbIZGoFE

    — Sanjay Raut (@rautsanjay61) July 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'నేను ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో ఇప్పుడే మాట్లాడాను. ఆయన దృఢంగా ఉన్నారు. ప్రజల మద్దతు ఆయనకే ఉందని చెప్పారు. ఇటువంటి సర్కస్​ను మహారాష్ట్ర ప్రజలు ఎక్కువ కాలం సహించరు. కొంతమంది మహారాష్ట్ర రాజకీయాలను పూర్తిగా నాశనం చేయాలని నిశ్చయించుకున్నారు. వారు ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్లనివ్వండి'

--సంజయ్ రౌత్​, శివసేన యూబీటీ వర్గం నాయకుడు

'ట్రిపుల్ ఇంజిన్ సర్కార్​'
మరోవైపు అజిత్ పవార్​.. ఎన్​డీఏలో చేరడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే స్పందించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉన్నారని అన్నారు. ' ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ కాస్త ట్రిపుల్ ఇంజిన్ సర్కార్​గా మారింది. మహారాష్ట్ర అభివృద్ధి కోసం.. అజిత్ పవార్, ఎన్​సీపీ నాయకులు ప్రభుత్వంలో భాగం కావడాన్ని నేను సంతోషిస్తున్నాను. అజిత్ పవార్ అనుభవం రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.' అని శిందే అభిప్రాయపడ్డారు.

  • #WATCH | Maharashtra CM Eknath Shinde says "Now we have 1 Chief Minister and 2 Deputy Chief Ministers. The double-engine government has now become triple engine. For the development of Maharashtra, I welcome Ajit Pawar and his leaders. Ajit Pawar's experience will help strengthen… pic.twitter.com/B5ZFBDX7Yb

    — ANI (@ANI) July 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jul 2, 2023, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.