ETV Bharat / bharat

నాగ్​పుర్​లో మళ్లీ లాక్​డౌన్​- త్వరలో పుణెలోనూ! - Anandvan corona news

కరోనాను కట్టడి చేసేందుకు నాగ్​పుర్​లో లాక్​డౌన్​ విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం. తాజా మార్గదర్శకాల ప్రకారం.. మార్చి 15 నుంచి 21 వరకు అక్కడ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పుణెలో కేసులు రోజువారీ వైరస్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. అక్కడా త్వరలోనే పూర్తిస్థాయి కఠిన ఆంక్షలు విధిస్తామని మేయర్​ వెల్లడించారు.

Lockdown in Nagpur from March 15th to 21st
కరోనా విజృంభణ- నాగ్​పుర్​లో లాక్​డౌన్​
author img

By

Published : Mar 11, 2021, 2:07 PM IST

Updated : Mar 11, 2021, 2:33 PM IST

మహారాష్ట్ర నాగ్​పుర్​లో కరోనా కేసులను అరికట్టేందుకు లాక్​డౌన్​ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. ఫలితంగా.. ఈ నెల 15 నుంచి 21 వరకు కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయి. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

పుణెలో లాక్​డౌన్ లేదు కానీ..

పుణెలో కొవిడ్​ రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయినప్పటికీ అక్కడ లాక్​డౌన్ ఆంక్షలు అమల్లో లేవు.​ కానీ, రాత్రి వేళ కర్ఫ్యూ నిబంధనలు అమలు చేస్తోంది అక్కడి పాలనా యంత్రాంగం. మార్చి 14 వరకు పాఠశాలలు, కళాశాలల మూసివేత కొనసాగుతోంది. అయితే.. త్వరలోనే కఠిన నిబంధనలు అమలు చేస్తామని పుణె మేయర్​ మురళీధర్​ మొహోల్​ తెలిపారు.

ఔరంగాబాద్​లో..

ఔరంగాబాద్​లో రికార్డు స్థాయిలో కొవిడ్​ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్న స్థానిక పాలనా యంత్రాంగం.. అక్కడ పాక్షిక లాక్​డౌన్​ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే దుకాణాలు, మార్కెట్లకు అనుమతించింది. వారాంతాల్లో అన్ని దుకాణాలు, మార్కెట్లు, హోటళ్లు మూసివేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

మరోసారి కరోనా హాట్​స్పాట్​గా 'ఆనంద్​వన్'​..

ప్రసిద్ధ ఆనంద్​వన్​.. రెండో దశ కరోనా విజృంభణలో మరోసారి వైరస్​ హాట్​స్పాట్​ కేంద్రంగా మారింది. భారీ స్థాయిలో వైరస్​ కేసులు వెలుగు చూస్తున్నందున ఇక్కడ కొవిడ్​ కేర్​ సెంటర్​ను ఏర్పాటు చేశారు అధికారులు. కరోనాను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు సమాచారం.

ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా మరో 22,854మందికి కరోనా​

Last Updated : Mar 11, 2021, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.