ETV Bharat / bharat

కుంభమేళాలో పాల్గొంటే క్వారంటైన్​ తప్పనిసరి!

author img

By

Published : Apr 18, 2021, 7:03 AM IST

Updated : Apr 18, 2021, 9:30 AM IST

కుంభమేళాలో పాల్గొన్న వారు 14 రోజులు క్వారంటైన్​లో ఉండాలని దిల్లీ విపత్తు నిర్వహణశాఖ ఆదేశించింది. ఇదే బాటలో ఒడిశా, గుజరాత్​లూ సాగనున్నాయి. కుంభమేళా నుంచి రాష్ట్రాలకు తిరిగి వచ్చే భక్తులను క్వారంటైన్​లో ఉంచనున్నట్లు ప్రకటించాయి.

Kumbh Mela
కుంభమేళా

కొవిడ్‌ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ కుంభమేళాలో పాల్గొని తిరిగొచ్చిన వారిపై పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కుంభమేళాకు వెళ్లి వచ్చిన దిల్లీ వాసులు 14 రోజులు హోంక్వారంటైన్‌లో ఉండాలని దిల్లీ విపత్తు నిర్వహణశాఖ ఆదేశించింది. ఈ మేరకు కుంభమేళాకు వెళ్లి వచ్చినవారు 24గంటల్లో తమకు వివరాలు సమర్పించాలని స్పష్టంచేసింది. నిబంధనలు పాటించకపోతే ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలిస్తామని పేర్కొంది.

మధ్యప్రదేశ్​లో

కుంభమేళాలో పాల్గొన్న భక్తులను ఐసోలేషన్​కి తరలించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 60వేలకుపైగా క్రియాశీల కేసులు ఉన్నాయి. కరోనాను అదుపు చేసేందుకు చేపట్టిన చర్యలకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

గుజరాత్​లో నెగెటివ్ తప్పనిసరి..

కుంభమేళా నుంచి తిరిగి వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది గుజరాత్‌ ప్రభుత్వం. ఈ మేరకు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు వీరిపై నిఘా ఉంచాలని.. స్వగ్రామాల్లోకి ప్రవేశించకుండా నాకాబందీ నిర్వహించాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో పాటు ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌తో కలిసి గుజరాత్​ జామ్‌నగర్‌లో కరోనా వైరస్ పరిస్థితిపై సమీక్షించారు.

కరోనా రోగుల చికిత్సకు గుజరాత్​ వ్యాప్తంగా 25-30 వేల పడకలను అతి కొద్ది సమయంలోనే సమకూర్చినట్లు రూపానీ వెల్లడించారు.

ఒడిశాలోనూ..

కుంభమేళాకు హాజరై తిరిగి రాష్ట్రంలోకి ప్రవేశించేవారు 14 రోజుల నిర్బంధంలో ఉండాల్సిందేనని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. వీరందరికీ కొవిడ్-19 పరీక్షలు తప్పనిసరి చేసింది. ఇంట్లో లేదా తాత్కాలిక వైద్య శిబిరాల్లో స్వీయ నిర్బంధాన్ని పూర్తి చేయవచ్చని ఒడిశా వైద్యాధికారులు తెలిపారు.

కుంభమేళాలో పాల్గొన్న భక్తులను గుర్తించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ పోర్టల్​లో రిజిస్టర్ చేసుకున్న వ్యక్తుల జాబితాను సిద్ధం చేశారు అధికారులు. వీరందరినీ ట్రాక్ చేసి.. వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని నిర్ణయించారు. లక్షలాది భక్తులు హాజరైన ఈ కుంభమేళాను 'సూపర్ స్ప్రెడర్' ఈవెంట్​గా పరిగణిస్తున్నారు.

హరిద్వార్​లో గత ఐదురోజుల్లోనే 2,167 మంది కరోనా బారిన పడ్డారు. మరోవైపు రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నప్పటికీ.. కుంభమేళా ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి: కుంభమేళాపై అఖాడాల దారెటు- ముందుగానే ముగిస్తారా?

'కుంభమేళా'పై జునా అఖాడా కీలక నిర్ణయం

Last Updated : Apr 18, 2021, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.