ETV Bharat / bharat

ఇంట్లో గణపతి చిత్రం ఏ దిక్కున ఉండాలి - వాస్తు చెబుతున్నది ఇదే!

Lord Ganesh Vastu Tips : కార్యక్రమం ఏదైనా మొదటి పూజ వినాయకుడికే. మరి.. అంతటి ప్రాముఖ్యత ఉన్న గణపతిని ఇంట్లో ఏ దిక్కున ఉంచాలో తెలుసా? ఈ విషయంలో వాస్తు ఏం చెబుతోందో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Ganesh Vasthu Tips
Lord Ganesh Vastu Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 9:44 AM IST

Lord Ganesh Vastu Tips : దేశంలో మెజారిటీ హిందువులు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు. కొత్త ఇంటిని నిర్మించేటప్పుడే కాదు.. ఆ తర్వాత ఇంట్లో వస్తువులు ఏ దిక్కున ఉండాలనే విషయంలో కూడా వాస్తును పాటించాలని వాస్తు నిపుణులు సూచిస్తుంటారు. ఇంటి విషయంలో, ఇంట్లోని వస్తువుల విషయంలో వాస్తును పాటించడం వల్ల.. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని.. వృత్తి, విద్య, ఆరోగ్య విషయాల్లో నష్టాలు రాకుండా ఉంటాయని భావిస్తారు.

ఇక ప్రతీ ఇంట్లో దేవుడి విగ్రహాలు, చిత్రపటాలు తప్పక ఉంటాయి. ముఖ్యంగా ఆది దేవుడిగా పిలుచుకునే గ‌ణ‌ప‌తి విగ్రహం తప్పక ఉంటుంది. వినాయకుడు ఇంట్లో ఉండటం వల్ల.. దోషాల‌న్నీ తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. వాస్తు శాస్త్రం కూడా.. గణపతి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించడం మంచిదని సూచిస్తోంది. ఇంట్లో, పని చేసే చోట గణపతి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఇంట్లో గణపతి విగ్రహాలు లేదా ఫొటోలు ఏ దిక్కులో పెట్టుకుంటే శుభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయక ప్రతిమ ఎక్కడ ఉండాలి?
ఇంట్లో పరిస్థితిని బట్టి గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మీ పిల్లలు చదువులో రాణించలేకపోతుంటే.. స్టడీ రూమ్‌లో లేదా రీడింగ్‌ టేబుల్‌పై పసుపు లేదా లేత ఆకుపచ్చ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే.. తెలుపు రంగులో ఉండే గణ‌ప‌తి విగ్రహాన్ని.. డబ్బు భ‌ద్ర‌ప‌రిచే ప్రదేశంలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. దేవుడి గదిలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకుంటే.. పసుపు రంగులో ఉంటే మంచిదని సూచిస్తున్నారు.

ఇంట్లో గణ‌ప‌తి ప్రతిమను ప్రతిష్టించడంతోపాటు వ్యాపార స్థలంలోనూ వినాయకుడిని పూజించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని అంటున్నారు. ఇంటి ప్రధాన ద్వారం లోపల వినాయకుడి విగ్రహాన్ని పెట్టి, ప్రతి రోజు ఉదయం పూజ కార్యక్రమాలను నిర్వహించాలని సూచిస్తున్నారు. పడకగదిలో మాత్రం గణ‌ప‌తి విగ్రహం, ఫొటోలు ఉండకూడదట.

గణ‌ప‌తి విగ్రహం ఏ దిశలో ఉండాలి?
ఇంటి ఈశాన్య దిక్కులో వినాయ‌క విగ్ర‌హం ప్రతిష్టించడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇంట్లో పూజ చేయడానికి ఈశాన్య మూల సరైన వాస్తు కలిగిన ప్రదేశం. అలాగే ఇంటికి తూర్పు లేదా పడమర దిశలో వినాయకుడిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో దక్షిణం వైపు గణపతిని పెట్టకూడదని నిపుణులు అంటున్నారు.

వినాయక ప్రతిష్ఠాపన నియమాలు..
అయితే.. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. తొండం ఎడమవైపున‌కు తిరిగిన గణపతి విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో ఉంచాలి. గణపతి విగ్రహం ఎత్తు పన్నెండు అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి. గణపతికి తులసి మాల‌ను ఎప్పుడూ సమర్పించవద్దు. పైన తెలిపిన వివరాల ప్రకారం వినాయ‌క‌ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం ద్వారా ఇంట్లో సుఖశాంతులు విరజిల్లుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

Vastu Tips for Happy Living : మీరు ఈ వాస్తు సూత్రాలు పాటిస్తున్నారా..? అప్పుడే ప్రశాంతత!

గుమ్మాలు, కిటికీలు సరి సంఖ్యలోనే ఉండాలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.