ETV Bharat / bharat

తమిళ పోరు: పార్టీల నోట 'మద్య నిషేధం' మాట - dmk manifesto

తమిళనాడు ఎన్నికల కౌంట్​డౌన్ మొదలైన క్రమంలో తమిళ రాజకీయాల్లో 'మద్యనిషేధం' అంశం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార అన్నాడీఎంకేతో పాటు ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు.. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని తమ మేనిఫెస్టోల్లో పేర్కొన్నాయి. అయితే గతంలో కాంగ్రెస్​ తీసుకొచ్చిన 'మద్య నిషేధం' చట్టాన్ని అన్నాడీఎంకే, డీఎంకేలు ఎత్తివేసిన సందర్భాలూ ఉన్నాయి. మరి ఈసారి ఆయా పార్టీలు ప్రయోగించిన లిక్కర్​ అస్త్రం ఏంత మేరకు ఫలితాన్నిస్తుంది?

Liquor ban promise surfaces again in poll-bound TN
తమిళనాడు ఎన్నికల్లో 'లిక్కర్​' అస్త్రం ఫలించేనా?
author img

By

Published : Mar 29, 2021, 5:31 PM IST

ఎన్నికలు అనగానే.. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. ఉచిత విద్యుత్​, రోడ్ల నిర్మాణం వంటి హామీలతో ఊరిస్తూ ఉంటాయి. 'మద్యపానం నిషేధం' కూడా ఆ కోవకు చెందిందే! తమిళనాడులో త్వరలో జరగనున్న ఎన్నికలకు కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగించాయి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు. తాము అధికారంలోకి వస్తే వైన్​షాపులను మూసివేస్తామని మేనిఫెస్టోల్లో పేర్కొన్నాయి. మరి పార్టీల 'మద్యనిషేధం' ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది? వారి వాగ్దానాలేంటి?

నాటి పరిస్థితులు..

స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ దిగ్గజ నేత సీ. రాజగోపాలచారి.. తమిళనాడు ప్రొహిబిషన్​ యాక్ట్​ 1937ను అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం 1971 వరకు తమిళనాట సంపూర్ణ మద్యం నిషేధం అమల్లో ఉంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కరుణానిధి ప్రభుత్వం మద్యనిషేధాన్ని ఎత్తివేసింది. నిర్ణయాన్ని మార్చుకోవాలని రాజగోపాలచారి చెప్పినా పట్టించుకోలేదు. కానీ మూడేళ్ల తరువాత మళ్లీ నిషేధం అమలు చేసింది డీఎంకే ప్రభుత్వం.

ఇదీ చదవండి : తమిళ బరిలో తెలుగు వెలుగులు!

ఎంజీఆర్ ప్రభుత్వం

ఎంజీఆర్ అధ్యక్షతన ఏర్పడిన ఏఐడీఎంకే ప్రభుత్వం(1977-81).. తిరిగి పర్మిట్​ యజమానులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. ఆ తరువాత మద్యం నిషేధాన్ని క్రమంగా ఎత్తివేసింది.

అంతకుముందు లిక్కర్ అవుట్​లెట్​లకు లైసెన్స్​లను వేలంపాట వేయగా.. 2003 నుంచి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్(టీఏఎస్​ఎంఏసీ) ద్వారా ప్రభుత్వం వీటిని తమ చేతుల్లోకి తీసుకుంది.

2016లోనూ 'లిక్కర్​' అస్త్రం..!

2015లో.. లిక్కర్​ అవుట్​లెట్​లకు వ్యతిరేకంగా పోరాడుతున్న గాంధేయవాది శశి పెరుమాళ్​ మృతిచెందటం వల్ల మద్యనిషేధం డిమాండ్​ తారస్థాయికి చేరింది. దీంతో 2016 ఎన్నికల మేనిఫెస్టోలో.. రెండు ద్రవిడ​ పార్టీలూ లిక్కర్ నిషేధాన్ని ప్రధాన అంశంగా మార్చుకుని ముందుకెళ్లాయి. ఆ సమయంలో మద్యనిషేధం, రాష్ట్రవ్యాప్తంగా వైన్​ షాపులు మూసివేత, లిక్కర్​ ఉత్పత్తి, నిల్వలను ఆపివేయటంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.

అయితే.. మద్యం అమ్మకం ద్వారా సంవత్సరానికి రూ. 30వేల కోట్లు రాష్ట్ర ఖజానాలో చేరుతుండటం గమనార్హం.

ఇదీ చదవండి : తమిళ పోరు: ఈ ఆరుగురిపైనే అందరి దృష్టి

2016 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 500 విదేశీ బెల్టు షాపులను మూసివేసింది నాటి జయలలిత ప్రభుత్వం.

నేటి పరిస్థితులు..

ఇప్పడు మళ్లీ మద్యంపై నిషేధం అంశం తెరపైకి వచ్చింది. దశలవారీగా నిషేధాన్ని తిరిగి అమలు చేస్తామని, లిక్కర్​ ఔట్​లెట్లను మూసివేస్తామని అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు తమ మేనిఫెస్టోలో పేర్కొన్నాయి.

డీఎంకే ఒక అడుగు ముందుకేసి.. రాష్ట్రంలో డీ-అడిక్షన్​ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

అయితే తమిళనాడులో సంపూర్ణ మద్యనిషేధంతో రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తరలివస్తుందని గతంలో డీఎంకే వాదించింది. అన్ని సరిహద్దు రాష్ట్రాల్లో మద్యం అందుబాటులో ఉన్నందున అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కట్టడి చేయటం అసాధ్యమని చెప్పుకొచ్చింది. కానీ తర్వాత.. మనసు మార్చుకుని సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని అస్త్రాన్ని ప్రయోగించింది.

'అప్పట్లోనే అమలు చేశాం'

డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్​ కూడా తన మేనిఫెస్టోలో మద్యనిషేధం అంశాన్ని ప్రస్తావించింది. 1967లోనే తాము తమిళనాడులో మద్యంపై నిషేధాన్ని అమలు చేశామని.. మరోసారి అమలు చేయటానికి తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని స్పష్టం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే.. లిక్కర్​ నిషేధంపై నిపుణులు, అధికారులతో కమిటీ వేస్తామని హామీ ఇస్తోంది. అక్రమంగా మద్యం రాష్ట్రంలోకి రాకుండా అరికడతామని వాగ్ధానాలు చేస్తోంది. మద్యం నిషేధం ద్వారా కోల్పోయిన రెవెన్యూను తిరిగి ఎలా సృష్టించాలన్నదానిపైనా చర్యలు తీసుకుంటామంటున్నాయి కాంగ్రెస్​ వర్గాలు.

దశలవారీగా లిక్కర్ షాపులను మూసివేసి.. పునరావాస కేంద్రాలను ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెప్తోంది. పాఠశాల, కాలేజీ విద్యార్థలకు మద్యం భూతంపై అవగాహన కల్పిస్తామంటోంది. అంతేకాక అక్రమ సారా కాస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తోంది.

ఇదీ చదవండి : ఓటింగ్​లో వెల్లివిరుస్తున్న మహిళా చేతన

'శాశ్వతంగా మూసివేస్తాం'

డీఎంకే కూటమిలోని ఎండీఎంకే కూడా ఇదే స్వరాన్ని వినిపించింది. తన మేనిఫెస్టోలో లిక్కర్ దుకాణాలను శాశ్వతంగా మూసివేస్తామని, మద్యంపై నిషేధం విధిస్తామని తెలిపింది. మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని తిరిగి పొందేందుకు నిపుణులతో కూడిన కమిటీ వేస్తామని హామీ ఇచ్చింది. మద్యంపై నిషేధం కోసం 'వైకోం పాదయాత్ర' నిర్వహించామని గుర్తుచేసింది. సంపూర్ణ నిషేధం తమ లక్ష్యం అంటూ మేనిఫెస్టోలో స్పష్టం చేసింది.

'ఎన్నికల డ్రామా'

సంవత్సరాల పాటు మద్యనిషేధ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన గాంధీయ మక్కల్ ఇయక్కమ్​ అధినేత తమిళారువి మణియన్.. ప్రధాన పార్టీల హామీలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకే మద్యనిషేధం అంశాన్ని తెరపైకి తెస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యనిషేధ చట్టాన్ని అమలు చేసేంత వరకు పోరాడతానని స్పష్టం చేశారు.

"ఎన్నికల్లో విజయం సాధించేందుకే అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే మద్యనిషేధం అంశాన్ని ఎత్తుకున్నాయి. గతంలోనూ ఇదే విధంగా హామీలు ఇచ్చాయి. మద్యనిషేధ అమలుకు మాత్రం కట్టుబడి ఉండటం లేదు."

-- తమిళారువి మణియన్, గాంధీయ మక్కల్ ఇయక్కమ్​ అధినేత

ప్రజలపై రాజకీయ పార్టీలు ప్రయోగించిన ఈ అస్త్రం ఏ మేరకు ఫలితానిస్తుందనేది మే 2నే తెలుస్తుంది.

ఇదీ చదవండి : తమిళనాట వాళ్లు లేకపోయినా వాడీవే'ఢీ'!

ఇదీ చదవండి : పళనిస్వామి 'పాంచ్ పటాకా' మోగించేనా?

'భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి'

వివాదాల సుడిలో కమల్- ఫలితమేంటి?

సీమన్​ బలంతో 'తమిళపోరు'కు ఎన్​టీకే సై

'తమిళవాదం'పై డీఎంకే, అన్నాడీఎంకే ఏకస్వరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.