ETV Bharat / bharat

'కొవిడ్​ను వదిలేసి విమర్శకులపై మోదీ ప్రభుత్వం కొరడా' - లాన్సెట్​ సూచనలు

కరోనా కట్టడిలో వచ్చిన ప్రారంభ విజయాలను భారత్ చేజేతులా నాశనం చేసుకొందని ప్రఖ్యాత మెడికల్​ జర్నల్​ లాన్సెట్ తన సంపాదకీయంలో ​ విమర్శించింది. ప్రస్తుతం కరోనా సంక్షోభం దావానలంలా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని పునఃసమీక్షించుకోవాలని హితవు పలికింది. ఒకవేళ పరిస్థితులు చేయిదాటి పోయి సంక్షోభం తీవ్రమైతే అందుకు మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

modi, lancet
'కొవిడ్​ను వదిలేసి విమర్శకులపై మోదీ ప్రభుత్వం కొరడా'
author img

By

Published : May 8, 2021, 5:32 AM IST

Updated : May 8, 2021, 6:18 AM IST

కరోనా నియంత్రణలో ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ విమర్శనాత్మక సంపాదకీయం రాసింది. "కరోనా కట్టడిలో వచ్చిన ప్రారంభ విజయాలను భారత్ చేజేతులా నాశనం చేసుకొంది. ఏప్రిల్ వరకు కేంద్ర ప్రభుత్వ కొవిడ్ టాస్క్ ఫోర్స్ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. దాని పరిణామాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సంక్షోభం దావానలంలా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని పునఃసమీక్షించుకోవాలి" అని లాన్సెట్ సంపాదకీయం పేర్కొంది.

ప్రభుత్వానిదే బాధ్యత..

ఒకవేళ పరిస్థితులు చేయిదాటి పోయి సంక్షోభం తీవ్రమైతే అందుకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మే 8వ తేదీ సంచికలో హెచ్చరించింది. ఇప్పటికైనా జరిగిన తప్పుల్ని దిద్దుకొని నాయకత్వ పటిమను అందిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తేనే మహమ్మారిపై విజయం సాధ్యమవుతుందని హితవుపలికింది. ఇందుకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అనుసరించాలని సూచించింది. టీకా కార్యక్రమ వేగాన్ని పెంచడం ఒకటైతే, వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం మరొకటి అని అభిప్రాయపడింది.

ఇదీ చూడండి: 'వాటిని 2 నెలలు నిషేధిస్తేనే కరోనాకు అడ్డుకట్ట!'

క్షమార్హం కాదది..

ప్రధాని మోదీ సంక్షోభ సమయంలో విమర్శలను నిలువరించడానికి ప్రయత్నిస్తూ, బహిరంగంగా చర్చకు దూరంగా ఉండటం క్షమార్హం కాదని తెలిపింది. ఇన్​స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ ఆగస్టు 1కల్లా భారత్ లో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని అంచనా వేసింది. ఒకవేళ అలాంటి పరిస్థితి తలెత్తితే ఆ జాతీయ విపత్తుకు మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని పేర్కొంది.

"ప్రస్తుతం భారతీయులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. రోజుకు 3.78 లక్షల కేసుల చొప్పున మే 4నాటికి దాదాపు 2.20 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 2.22 లక్షల మందికి పైగా మరణించారు. వీటిని భారీ సంఖ్యలో తగ్గించి చూపుతున్నట్లు నిపుణులు నమ్ముతున్నారు. ఆసుపత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. వైద్య సిబ్బందీ అలసిపోయారు. వైరస్ బారిన పడుతున్నారు. సామాజిక మాధ్యమాల నిండా ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలతో... ఆక్సిజన్, ఆసుపత్రుల్లో పడకలు, ఇతర అవసరాల కోసం అర్థిస్తున్న పోస్టులే కనిపిస్తున్నాయి.

దేశంలో గత మార్చిలో కరోనా రెండో తరంగం ఉవ్వెత్తున ఎగవడానికి ముందే భారత్ లో వైరస్ ఆట ముగిసిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. దేశంలో కొత్త రకం వైరస్​లు పుట్టుకొచ్చాయి. మున్ముందు రెండో అల తాకే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నప్పటికీ కొన్ని నెలలపాటు కేసులు తగ్గిపోవడంతో భారత ప్రభుత్వం తాము కొవిడ్-19ని జయించామన్న భావనకు వచ్చేసింది.

భారత్ స్వతఃసిద్ధమైన రోగ నిరోధక శక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) సంపాదించినట్లు కొన్ని మోడల్స్ తప్పుగా చెప్పాయి. అది నిర్లక్ష్యాన్ని ఎగదోసి, ముందస్తు సన్నద్ధతను నీరు గార్చింది. అయితే భారత వైద్య పరిశోధన మండలి జనవరిలో నిర్వహించిన సీరో సర్వేలో దేశంలో 21% జనాభాలో కొవిడ్ యాంటీ బాడీలు ఉన్నట్లు తేలింది. ఆ సమయంలో ప్రధాని మోదీ ప్రభుత్వం ట్విటర్‌లోని విమర్శలను తొలగించడంపై దృష్టి సారించింది. తప్పితే మహమ్మారి నియంత్రణ కోసం ప్రయత్నించలేదు"

-లాన్సెట్ సంపాదకీయం.

కొంపముంచిన ర్యాలీలు

"మున్ముందు ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు వచ్చినప్పటికీ ప్రభుత్వం దేశం నలు మూలల నుంచి లక్షల మంది ఒక్క చోట గుమికూడేందుకు వీలు కల్పించే మతపరమైన సూపర్ స్ప్రెడర్ కార్యక్రమాలకు పచ్చజెండా ఊపింది. దానికి తోడు భారీ రాజకీయ ర్యాలీలకు అనుమతిచ్చింది తప్పితే కొవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించలేకపోయింది. దేశంలో కరోనా కథ ముగిసిపోయిందన్న సందేశంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా చాలా మందకొడిగా ప్రారంభమైంది. ఇప్పటివరకు కేవలం 2% మందికే వ్యాక్సినేషన్ పూర్తయింది. జాతీయ స్థాయిలో భారత్ వ్యాక్సినేషన్ ప్రణాళిక త్వరగానే నేల చూపులు చూసింది. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండానే అకస్మాత్తుగా తన వ్యాక్సిన్ విధానంలో మార్పులు చేసి 18 ఏళ్ల పైబడిన వారందరికీ అనుమతిచ్చింది. ఒకవైపు సరఫరా అడుగంటుతున్న తరుణంలో ఇలా చేయడం ప్రజల్లో తీవ్ర అయోమయం సృష్టించింది. ఇప్పుడు మార్కెట్లో వ్యాక్సిన్ల కోసం రాష్ట్రాలు, ఆసుపత్రులు పోటీపడాల్సిన పరిస్థితి నెలకొంది"

-లాన్సెట్ సంపాదకీయం.

రాష్ట్రాల సమాయత్తత ఏదీ?

"అకస్మాత్తుగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులను ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు సమాయత్తం కాలేదు. అక్కడ మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్, ఆసుపత్రుల్లో పడకలు అడిగిన వారిపై జాతీయ భద్రతా చట్టాల కింద కేసులు పెట్టి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బెదిరించాయి కూడా. మరోవైపు కేరళ, ఒడిశా లాంటి రాష్ట్రాలు బాగా సమాయత్తమయ్యాయి. రెండో ఉద్దృతిలో సొంతంగా ఆక్సిజన్ తయారు చేసుకోవడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయగలిగాయి" అని లాన్సెట్ వివరించింది.

తక్షణ కర్తవ్యం ఏమిటంటే..?

  1. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని హేతుబద్ధీకరించి దాని వేగాన్ని పెంచాలి. టీకాల సరఫరాను అధికం చేయాలి. పట్టణ ప్రాంత వాసులకే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల కొరతను ఎదుర్కొంటున్న గ్రామీణ వాసులకూ అందేలా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
  2. వ్యాక్సినేషన్ జరిగే సమయంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం స్పష్టమైన డేటాను ఎప్పటికప్పుడు బహిర్గతం చేయాలి. దేశంలో ఏం జరుగు తోందన్న విషయాన్ని ప్రజలకు ప్రతి 15 రోజులకోసారి వివరించాలి. కరోనా గ్రాఫ్​ను తగ్గించడానికి ఏం చేయాలో చెప్పాలి. అవసరమైతే దేశవ్యాప్తంగా లాక్​డౌన్ పెట్టాలి.
  3. వైరస్ జన్యు పరిణామక్రమ విశ్లేషణను విస్తరించి దాన్ని సరిగా అర్ధం చేసుకోవడంతో పాటు రోగాన్ని వేగంగా విస్తరింపజేస్తున్న కొత్త రకాలను కనిపెట్టాలి.

ఇదీ చూడండి: 'లాక్​డౌన్ కాదు.. అంతకుమించి ఆలోచించండి'

Last Updated : May 8, 2021, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.