ETV Bharat / bharat

కదులుతున్న రైల్లో పురుడు పోసిన ల్యాబ్​ టెక్నీషియన్​

చాకచక్యంతో వ్యవహరించిన ఓ ల్యాబ్​ టెక్నీషియన్​ నిండు గర్భిణీకి సురక్షితంగా డెలివరీ చేశాడు. వీడియో కాల్​ ద్వారా డాక్టర్ ఇచ్చే సలహాలు పాటిస్తూ మహిళ ప్రసవానికి సహకరించాడు. సినిమాను తలపించే ఈ ఘటన మధుర రైల్వే స్టేషన్​ పరిధిలో జరిగింది.

Lab technician helps a woman give birth on moving train, uses video call to seek advice from doctor
కదులుతున్న రైల్లో పురుడు పోసిన ల్యాబ్​ టెక్నీషియన్​
author img

By

Published : Jan 19, 2021, 3:51 PM IST

కదులుతున్న రైల్లో నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణీకి.. ఓ ల్యాబ్​ టెక్నీషియన్​ పురుడు పోసిన ఘటన యూపీ మధుర రైల్వే స్టేషన్​ పరిధిలో జరిగింది. అచ్చం అమీర్​ఖాన్​ '3 ఇడియట్స్​' సినిమాలో లాగే వీడియో కాల్​ ద్వారా డాక్టర్ చెప్పే​ సూచనలు పాటిస్తూ పండంటి బిడ్డకు ఆయువు పోశారు.

ఉత్తర రైల్వే డివిజనల్​ ఆసుపత్రిలో ల్యాబ్​ టెక్నీషియన్​గా పని చేసే సునీల్​ ప్రజాపతి.. దిల్లీ నిజాముద్దీన్​ నుంచి మధ్యప్రదేశ్​ సాగర్​కు రైల్లో బయలుదేరారు. ఫరీదాబాద్​ సమీపంలోకి రాగానే.. ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ కనిపించింది. తోడుగా ఆమె సోదరుడు ఉన్నారు. జనవరి 20న డెలివరీ తేదీ ఉండటం వల్ల దమోహ్​లోని ఆసుపత్రికి వెళ్తున్నట్లు వారు సునీల్​కు తెలిపారు.

మా ఆసుపత్రిలో పనిచేసే డా.సుపర్ణకు ఫోన్​ ద్వారా విషయాన్ని తెలియజేశాను. ఆమె​ వీడియో కాల్​ ద్వారా పలు సూచనలు చేశారు. వాటిని జాగ్రత్తగా పాటిస్తూ సదరు మహిళకు పురుడు పోశాను. ఆర్​పీఎఫ్​ పోలీసులకు సమాచారం అందించగా.. తల్లి బిడ్డలిద్దరినీ మధుర జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. నేను డాక్టర్​ కానప్పటికీ.. ఆ మహిళకు చేసిన సహాయంపై చాలా సంతోషంగా ఉన్నాను.

-సునీల్​ ప్రజాపతి, ల్యాబ్​ టెక్నీషియన్​.

ఇదీ చదవండి: 'సాగు చట్టాలపై నిష్పక్షపాతంగా చర్చలు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.