ETV Bharat / bharat

కుంభమేళాకు భారీగా తరలివచ్చిన భక్తులు - snan at Har Ki Pauri'

కుంభమేళాలో భాగంగా హరిద్వార్​లోని 'హర్​ కీ పౌరీ' ఘాట్​ వద్దకు రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు భక్తులు.. సోమవారం భారీ సంఖ్యలో తరలివచ్చారు. 'హరహర​ మహా దేవ్​' నినాదాలతో పుష్కర ఘాట్లు హెరెత్తాయి.

shahi snan
కుంభమేళలో రెండో షాహీ స్నానాలు- భారీగా భక్తులు
author img

By

Published : Apr 12, 2021, 3:53 PM IST

ఉత్తరాఖండ్​​ హరిద్వార్​లోని కుంభమేళాలో పుష్కర ఘాట్లు సోమవారం.. 'హరహర మాహాదేవ్​', 'గంగా మాతాకీ జై' నినాదాలతో హోరెత్తాయి. కుంభమేళలో భాగంగా 'హర్​ కీ పౌరీ' ఘాట్ వద్ద సోమవారం అఘోరాలు, సాధువులు, భక్తులు రెండో షాహీ స్నానాలు చేశారు. అయితే.. కరోనా విజృంభిస్తున్న వేళ వేలాది మంది పుణ్యస్నానాలకు హాజరవటంపై ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు.

shahi snan
జనసంద్రంగా నదీ తీరాలు
shahi snan
హర్​ కీ పౌరీ ఘాట్​ వద్ద భక్తులు
shahi snan
సాధువుల రెండో షాహీ స్నానాలు

భారీ మొత్తంలో జనం హాజరవుతుండగా.. భౌతిక దూరం పాటించటం సాధ్యం కాదని కుంభమేళా జనరల్​ ఐజీ సంజయ్​ గుంజ్యాల్​ తెలిపారు. భౌతిక దూరం పాటించేందుకు ప్రయత్నిస్తే.. తొక్కిసలాట జరిగే ప్రమాదముందని చెప్పారు.

shahi snan
పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు
shahi snan
కుంభమేళాలో భక్తుల ఆనందోత్సాహం
shahi snan
'షాహీ స్నాన్​లో భారీగా పాల్గొన్న జనం

రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు.. నేపాల్​ రాజు జ్ఞానేంద్ర వీర్​ విక్రమ్​ సింగ్​ ఆదివారం హరిద్వార్​కు చేరుకున్నారు.

మొదటి షాహీ స్నానాలు మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ముగిశాయి. రెండో షాహీ స్నానాలు సోమవారం, బుధవారం జరగనున్నాయి.

ఉత్తరాఖండ్​లో ఆదివారం ఒక్కరోజే 1,333 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 7,323 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

ఇదీ చూడండి: హరిద్వార్​లో గంగా హారతి- తరలివచ్చిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.