ETV Bharat / bharat

పరువు హత్యల కలకలం.. పెళ్లైన 5 రోజులకే దంపతులను దారుణంగా నరికి..

Kumbakonam Honor Killing: ప్రేమించి పెళ్లిచేసుకున్న ఓ జంటను.. యువతి కుటుంబసభ్యులు దారుణంగా హత్య చేశారు. పెళ్లైన 5 రోజులకే ఇద్దరిని పొట్టనపెట్టుకున్నారు. తమిళనాడు కుంభకోణంలో ఈ ఘటన జరిగింది.

Kumbakonam Honor Killing - intercaste marriage - couples killed brutally
author img

By

Published : Jun 14, 2022, 10:58 AM IST

Updated : Jun 14, 2022, 12:44 PM IST

Kumbakonam Honor Killing: తమిళనాడు కుంభకోణంలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటను.. యువతి కుటుంబసభ్యులు దారుణంగా హత్య చేశారు. పెళ్లైన ఐదు రోజులకే ఈ దారుణానికి ఒడిగట్టారు నిందితులు.
ఇదీ జరిగింది: కుంభకోణం సమీపంలోని తులుక్కవేళి గ్రామానికి చెందిన 24 ఏళ్ల శరణ్య.. చెన్నైలో నర్సుగా పనిచేస్తోంది. ఈమెకు అక్కడే పొన్నూర్​లో నివసించే 31 ఏళ్ల మోహన్​తో ఐదు నెలల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇదే క్రమంలో శరణ్య సోదరుడు శక్తివేల్.. ఆమెకు తన బావ రంజిత్​తో పెళ్లి చేయాలనుకున్నాడు. ఈ విషయం శరణ్యకు చెప్పగా.. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గతవారమే చెన్నైలో మోహన్​ను వివాహం చేసుకొని.. కుటుంబసభ్యులకు ఫోన్​ చేసి చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన శక్తివేల్​.. వారి హత్యకు ప్లాన్​ చేశాడు. రిసెప్షన్​ కోసం నూతన జంటను ఇంటికి ఆహ్వానించాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారమే తులుక్కవేళికి వచ్చిన దంపతులు శక్తివేల్​ ఇంట్లో భోజనం చేశారు. కొద్దిసేపటి తర్వాత చెన్నై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పుడే శక్తివేల్​, రంజిత్​ ఇద్దరూ శరణ్య, మోహన్​ను వెంటాడి దాడిచేశారు. తీవ్రగాయాలపాలైన ఇరువురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితులు ఇద్దరూ పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయారు. శరణ్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది కాగా.. మోహన్​ ముదలియార్​(బీసీ) కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. ఇదే హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఇవీ చూడండి: 'అన్నను కలిపిస్తే... పరువు దక్కిందేమో అడుగుతా?'

ప్రేమపై పగ.. మతం వేరని హత్య.. యువకుడ్ని రాళ్లతో దారుణంగా కొట్టి...

Last Updated : Jun 14, 2022, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.