జనతాదళ్(సెక్యులర్) ఎమ్మెల్సీ, కర్ణాటక శాసనమండలి ఉపసభాపతి ధర్మెగౌడ మరణంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం హెచ్డీ కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనది రాజకీయ హత్య అని ఆరోపించారు. ధర్మెగౌడ మృతి వెనక ఉన్న వాస్తవాలన్నీ బయటకు రావాలని, ఆయన మరణానికి కారణమైనవారిని బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు.
ధర్మెగౌడ తనకు సోదరుడి వంటివారని చెప్పారు కుమారస్వామి. ఆయన నిఖార్సైన రాజకీయ నేత అని కీర్తించారు.
దురదృష్టకరం
ధర్మె మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విచారం వ్యక్తం చేశారు. ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. ఉపసభాపతిగా మండలిని సమర్థంగా నడిపించారని కొనియాడారు.
అంతకుముందు, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ.. ధర్మె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధర్మెగౌడ ఎంతో ప్రశాంతంగా ఉండే వ్యక్తి అని.. ఆయన మరణంతో రాష్ట్రం ఓ మంచి నేతను కోల్పోయిందని అన్నారు.
సోమవారం సాయంత్రం ఇల్లు వదిలి వెళ్లిన ధర్మెగౌడ.. ఆదివారం ఉదయం రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించారు. సమీపంలోనే సూసైడ్ నోట్ లభించింది. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: ఉపసభాపతి మరణానికి ఇదే కారణమా?