గోమాతపై పాశవికంగా దాడి చేసిన ఘటన రాజస్థాన్ ఛిత్తోర్గఢ్ జిల్లా తుక్రాయ్ గ్రామంలో జరిగింది. గత కొద్దిరోజులుగా గ్రామంలోని ఆవులు వరుసగా మరణిస్తున్నందున స్థానికులకు అనుమానం వచ్చింది.
అదే సమయంలో ఆ గ్రామానికే చెందిన సోహన్లాల్ అలియాస్ పప్పు.. ఓ ఆవును బండరాయితో కొట్టి చంపేయడం స్థానికుల కంట పడింది. ఆవును హత్య చేస్తున్న సమయంలో గ్రామస్థులు వీడియో తీశారు.
ఈ ఘటనపై బేగన్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: డోలీ కట్టి వర్షంలోనే గర్భిణీ తరలింపు