కేరళలో రోజువారీ కరోనా కేసుల(Kerala Covid Cases) సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే తగ్గింది. ఆ రాష్ట్రంలో కొత్తగా 8,850 కేసులు(Kerala Covid Cases) వెలుగు చూశాయి. మరో 149 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరో 17,07 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
మహారాష్ట్రలో 2,026 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 26మంది ప్రాణాలు కోల్పోయారు.
వివిధ రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు ఇలా..
- తమిళనాడులో కొత్తగా 1,467 కేసులు నమోదయ్యాయి. 1,531 మంది కోలుకోగా, 16 మంది మృతి చెందారు.
- ఒడిశాలో 407 మందికి వైరస్ సోకింది. 606 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- కర్ణాటకలో కొత్తగా 397 కేసులు నమోదు కాగా.. 693 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 13 మంది మరణించారు.
- జమ్ముకశ్మీర్లో 100 మందిలో వైరస్ నిర్ధరాణ జరిగింది. వైరస్ కారణంగా ఎవరూ మరణించలేదు.
- గోవాలో కొత్త 43 మందికి కరోనా సోకింది. ముగ్గురు వైరస్ కారణంగా మరణించారు.
- దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 34 మందికి వైరస్ సోకగా.. వైరస్ కారణంగా ఎవరూ మరణించలేదు.
వ్యాక్సినేషన్..
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో (Vaccination Status In India) వేగంగా కొనసాగుతోంది. ఇటివలే దేశవ్యాప్తంగా 90 కోట్ల డోసుల పంపిణీ పూర్తికాగా... తాజాగా మరో ఘనతను సాధించింది. దేశ జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 70 శాతం మందికి తొలి డోసు పూర్తైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సోమవారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. బలమైన దేశం వేగవంతమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ అని కేంద్ర మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం కొత్త లక్ష్యాలను సాధిస్తోందని పేర్కొన్నారు. శభాష్ ఇండియా, కరోనాపై పోరాడదామాని మాండవీయ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు దేశ జనాభాలో 25 శాతం మందికి రెండు డోసులు పూర్తైనట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: డ్రోన్లతో టీకాల సరఫరా- 15 నిమిషాల్లో 26 కి.మీ ప్రయాణించి...