కేరళలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా రోజుకు సగటున 5వేల మందికిపైగా కొవిడ్ బారినపడుతున్నారు. శనివారం ఒక్కరోజే 6,293 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 7లక్షలు దాటింది. మహమ్మారి ధాటికి మరో 29 మంది మరణించగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,786కు పెరిగింది.
- మహారాష్ట్రలో మరో 3,940 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18.92 లక్షలకు పెరిగింది. వైరస్‌తో పోరాడుతూ మరో 74 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 48వేల 648కి ఎగబాకింది.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్కరోజులోనే 1,226 మంది కొవిడ్ బారినపడ్డారు. కేసుల సంఖ్య 5.73 లక్షలకు ఎగబాకింది. వైరస్ ధాటికి మరో 24 మంది బలవ్వగా.. చనిపోయిన వారి సంఖ్య 8,177కు చేరింది.
- దేశ రాజధాని దిల్లీలో మరో 1,139 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 6లక్షల 15వేలు దాటింది. దిల్లీలో ఇప్పటివరకు 10,251 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో శనివారం రోజు 1,152 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 9లక్షల 8వేల 275కు చేరింది. వైరస్‌తో మరో 15 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 12వేలు దాటింది.
- మధ్యప్రదేశ్‌లో మరో 1,085 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో కేసుల సంఖ్య 2.30 లక్షలకు చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 3,468 మందిని కొవిడ్ బలితీసుకుంది.
ఇదీ చదవండి: కరోనా కారణంగా 700మందిని కోల్పోయాం: రైల్వే