ETV Bharat / bharat

బావిలో పడిన ఏనుగు.. ఇలా బయటకు... - elephant viral video

కేరళలో ప్రమాదవశాత్తు బావిలో పడిన ఏనుగును గంటలపాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు అటవీ అధికారులు. అయితే.. గజరాజులు తరచూ ఇళ్లలోకి ప్రవేశిస్తూ.. ప్రమాదాలకు కారణమవుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన చేశారు.

Kerala: Wild elephant rescued from well after hours of operation
బావిలో పడిన ఏనుగు.. సురుక్షితంగా బయటకు
author img

By

Published : Jun 17, 2021, 2:03 PM IST

బావిలో పడిన ఏనుగును బయటకు తీసేందుకు సహాయక చర్యలు

కేరళ ఎర్నాకుళం జిల్లా కోతమంగళం గ్రామంలో ప్రమాదవశాత్తూ బావిలో పడిన ఏనుగును అటవీశాఖ రక్షించింది. గంటలపాటు నిర్వహించిన ఈ ఆపరేషన్​లో.. అదృష్టవశాత్తూ ఏనుగుకు తీవ్ర గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు.

గోపాలకృష్ణన్ అనే వ్యక్తి ఇంట్లోని బావిలో ఏనుగు పడిపోయిందనే సమాచారం మేరకు అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో బావికి ఓ వైపు మట్టిని తొలగించి.. ఏనుగు పైకి ఎక్కేందుకు వీలు కల్పించారు.

నిరసన నడుమ..

గ్రామంలోకి తరచూ ప్రవేశిస్తున్న ఏనుగుల రాకపోకలను అటవీ శాఖ నిరోధించకపోవడాన్ని స్థానికులు నిలదీశారు. ఏనుగు వల్ల తనకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలనే డిమాండ్​తో ఇంటి యజమాని గోపాలకృష్ణన్ సహాయక చర్యలకు ఆటంకం కలిగించినట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి: బావిలో పడిన ఏనుగు.. రోజంతా అందులోనే..

ఇదీ చదవండి: 15 గంటలు శ్రమించి.. గజరాజును రక్షించి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.