కేరళలో కరోనా కేసులు(Corona cases) పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 21,613 కేసులు నమోదయ్యాయి. మరో 18,556 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 127 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 37.03 లక్షలకు చేరింది. కేరళలో ఇప్పటివరకు 18,870 మంది వైరస్ బారిన పడి మృతిచెందారు.
మహారాష్ట్రలో కొత్తగా 4,408 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 116 మంది చనిపోగా.. మరో 5,424 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశ రాజధాని దిల్లీలో.. 38 మందికి వైరస్ సోకింది. మరో నలుగురు చనిపోయారు.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- తమిళనాడులో 1,804 మంది మహమ్మారి బారిన పడ్డారు. 1,917 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో కొత్తగా 1,298 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,833 మంది కోలుకోగా.. 32 మంది మృతిచెందారు.
- ఒడిశాలో కొత్తగా 720 మందికి కరోనా సోకగా.. 68 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మధ్యప్రదేశ్‌లో 11, గుజరాత్లో 17, ఉత్తర్‌ప్రదేశ్‌లో 27 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి.
- పంజాబ్‌లో మరో 37 కేసులు నమోదు కాగా.. వైరస్ బాధితుల సంఖ్య 6 లక్షలు దాటింది.
- బంగాల్లో కొత్తగా 547 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మహమ్మారి కారణంగా మరో 6 మంది చనిపోయారు.
- అసోంలో.. 741 కరోనా కేసులు వెలుగు చూడగా మరో 11 మంది మరణించారు.
మరోవైపు.. దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 56,00,94,581కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం ఒక్కరోజే 49,48,965 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది.
ఇదీ చూడండి: కరోనా భయంతో దంపతుల ఆత్మహత్య- రిపోర్టులో నెగిటివ్!
ఇదీ చూడండి: 'టీకా రెండు డోసులే... మళ్లీమళ్లీ కుదరదు'