దేశంలో కొవిడ్ వ్యాప్తి(Corona cases in India) స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. కేరళలో వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్తగా రాష్ట్రంలో(Kerala COVID cases) 19,352 కేసులు నమోదయ్యాయి. మరో 143 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,88,840 చేరగా.. మృతుల సంఖ్య 23,439కి పెరిగింది.
కేరళవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 27,266 మంది వైరస్‌ను జయించారు. దీనితో రికవరీల సంఖ్య 42,83,963కు చేరింది.
ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇలా..
- కర్ణాటకలో 889 కరోనా కేసులు నమోదయ్యాయి. 14 మంది కరోనాతో మరణించారు. 1,080 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,755 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- తమిళనాడులో 1,653 మందికి కొత్తగా కరోనా నిర్ధరణ అయింది. 22 మంది మహమ్మారి వల్ల మరణించారు. 1,581 మంది కోలుకున్నారు.
- రాజధాని నగరం దిల్లీలో మరో 41 మందికి కరోనా సోకింది. కొవిడ్ కారణంగా ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు.
వ్యాక్సినేషన్ రికార్డు..
దేశవ్యాప్తంగా కరోనా కట్టడి కోసం చేపడుతున్న టీకా కార్యక్రమం(Vaccination in India) మరో మైలురాయిని అందుకుంది. దేశంలో ఇప్పటివరకు 80 కోట్ల కోవిడ్ టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
ఇదీ చదవండి:
covid third wave india: మూడో దశ వ్యాప్తికి అదే కీలకం!
Vaccination In India: దేశంలో 80 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ