ETV Bharat / bharat

జనం కోసం పోలీసుల కొత్త కోర్స్.. 'గన్'​ వాడకంపై ట్రైనింగ్.. ఫీజు ఎంతంటే? - ప్రజలకు తుపాకీ శిక్షణ

మీ మెరుగైన భద్రత కోసం తుపాకీ వాడాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? కానీ ఉపయోగించే నైపుణ్యం లేదా? మీరు నిర్ణయించిన రుసుము చెల్లించడానికి సిద్ధంగా ఉంటే, కేరళ పోలీసులు తుపాకీ ఉపయోగంపై మీకు శిక్షణ ఇవ్వబోతున్నారు. అందుకు సంబంధించిన ఫీజు, తదితర వివరాలు తెలుసుకోండి.

Kerala poilce to give gun handling training to civilians
v
author img

By

Published : Jun 7, 2022, 3:28 PM IST

Kerala Police Gun Handling Training: తుపాకీ వినియోగంపై పౌరులకు శిక్షణ ఇవ్వనున్నారు కేరళ పోలీసులు. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ అనిల్​కాంత్ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. ఇప్పటికే తుపాకీ వినియోగించడానికి లైసెన్స్ ఉన్నవారు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. తుపాకీని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా అనుభవం లేనివారు రూ.5,000 చెల్లించి శిక్షణ తీసుకోవచ్చు. అలా కాకుండా కాస్త అవగాహన ఉన్నవారు, ఫైన్-ట్యూనింగ్ అవసరం ఉన్నవారు రూ.1000కే శిక్షణ పొందవచ్చు.

Kerala poilce to give gun handling training to civilians
డీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు

అయితే, ఎంపిక ప్రక్రియ మాత్రం కఠినంగా ఉంటుందని, శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఎంపిక అవ్వరని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు అధికారులు. ఎంపికకు ముందు నిపుణులు.. దరఖాస్తుదారుడి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని విశ్లేషిస్తారని తెలిపారు. ఈ సెలక్షన్ ట్రయల్‌లో ఉత్తీర్ణులైన వారికే ఒకసారి శిక్షణ ఇస్తే, ఆయుధాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదని పోలీసులు భావిస్తున్నారు. అందుకే కఠినంగా ప్రక్రియ చేపడతామని తెలుపుతున్నారు.

ఇటీవలే కేరళకు చెందిన ఓ వ్యక్తి.. తుపాకీ వినియోగంపై శిక్షణ ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. అందుకు స్పందించిన న్యాయస్థానం.. తుపాకీ లైసెన్స్​ ఉన్న వారికి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే డీజీపీ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇవీ చదవండి: సిద్ధూ కుటుంబానికి రాహుల్​ పరామర్శ.. పంజాబ్​ లాయర్ల కీలక నిర్ణయం!

ఇంజిన్ కింద కూర్చొని రైలు ప్రయాణం.. 190 కి.మీ వెళ్లిన తర్వాత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.