ETV Bharat / bharat

Corona cases: కేరళలో మరో 7వేల మందికి కరోనా - india new covid cases

కేరళలో కొత్తగా 7,722 మందికి కరోనా(Kerala Corona Cases) సోకినట్లు తేలింది. ఒక్కరోజే ఆ రాష్ట్రంలో వైరస్ కారణంగా 471 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 31,156కు పెరిగింది. మరోవైపు.. మహరాష్ట్రలో కొత్తగా 1,338 కరోనా కేసులు వెలుగు చూశాయి.

kerala corona cases
కేరళలో కరోనా కేసులు
author img

By

Published : Oct 29, 2021, 7:36 PM IST

Updated : Oct 29, 2021, 9:08 PM IST

కేరళలో కరోనా(Kerala Corona Cases) వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. మరోవైపు.. కొవిడ్​ మరణాల సంఖ్యను ఆ రాష్ట్రం మళ్లీ సవరించింది. దాంతో ఆ రాష్ట్రంలో కొత్తగా 471 మంది కరోనాతో(Kerala Corona Cases) మరణించినట్లు తేలింది. కొత్తగా 7,772 మంది వైరస్(Kerala Covid Cases Today) బారినపడ్డారు. ఫలితంగా కేరళలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 49,44,857కు చేరగా.. మరణాల సంఖ్య 31,156కు పెరిగింది.

కేరళలో మరో 6,648 మంది వైరస్​ను జయించగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 48,43,576కు చేరింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 78,722 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. కొత్తగా 76,043 నమూనాలను పరీక్షించగా.. తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 1,087 మందికి కొత్తగా వైరస్​ సోకినట్లు తేలింది. ఎర్నాకులంలో 1,047, త్రిస్సూర్​లో 847 మందికి వైరస్ నిర్ధరణ అయింది.

మహారాష్ట్రలో కొత్తగా 1,338 మందికి కరోనా(Maharashtra Coronavirus) సోకింది. మరో 36 మంది వైరస్ కారణంగా మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 66,09,292కు చేరగా.. మరణాల సంఖ్య 1,40,170కి పెరిగింది. మరో 2,584 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు..

  • తమిళనాడులో 1,039 మంది మహమ్మారి బారినపడ్డారు. 1,229 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 11 మంది మరణించారు.
  • కర్ణాటకలో 381 కరోనా కొత్త వెలుగు చూశాయి. మరో ఏడుగురు మృతి చెందారు.
  • ఒడిశాలో కొత్తగా 365 మందికి కరోనా సోకగా.. మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చూడండి:

Last Updated : Oct 29, 2021, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.