ETV Bharat / bharat

కేరళలో మరో 4,969 మందికి వైరస్​ - Tamilanadu Corona cases

దేశ వ్యాప్తంగా ఇటీవల కొవిడ్-19 కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం వైరస్​ విజృంభిస్తునే ఉంది. ముఖ్యంగా కేరళలో ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 4,969 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 6.88 లక్షలకు ఎగబాకింది.

Kerala adds over 4.9k fresh COVID-19 cases, tally climbs to 6.88 lakh
కొవిడ్ విధ్వంసం- కేరళలో మరో 4,969 మందికి వైరస్​
author img

By

Published : Dec 17, 2020, 9:47 PM IST

దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గినా.. ఆయా రాష్ట్రాల్లో మాత్రం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కేరళలో మరో 4,969 మంది వైరస్​ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 6లక్షల 88వేల 409కి చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,734 మంది వైరస్​కు బలయ్యారు.

  • మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 3,880 మందికి కరోనా​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18.84 లక్షలకు పెరిగింది. వైరస్​తో పోరాడుతూ మరో 65 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 48వేల 499కి ఎగబాకింది.
  • ఉత్తర్​ప్రదేశ్​లో మరో 1,539 మంది కరోనా బారినపడ్డారు. కేసుల సంఖ్య 5.70 లక్షలకు ఎగబాకింది. వైరస్ ధాటికి కొత్తగా 18 మంది బలవ్వగా.. చనిపోయిన వారి సంఖ్య 8,136కు చేరింది.
  • దేశ రాజధాని దిల్లీలో మరో 1,363 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 6లక్షల 13వేలు దాటింది. దిల్లీలో ఇప్పటివరకు 10,182 మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో ఒక్కరోజులోనే 1,236 మందికి వైరస్​ ఉన్నట్టు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 9లక్షల 5వేల 901కి చేరింది. వైరస్​తో మరో 10 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 11,981కి పెరిగింది.
  • తమిళ రాష్ట్రంలో కొత్తగా 1,174 వైరస్​ కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 8లక్షల 3వేలకు పెరిగింది. ఇప్పటివరకు అక్కడ 11,942 కరోనా మరణాలు సంభవించాయి.
  • రాజస్థాన్​​లో మరో 1,112 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో కేసుల సంఖ్య 2.95 లక్షలకు చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,589 మందిని కొవిడ్​ బలితీసుకుంది.

ఇదీ చదవండి: సాగు చట్టాల ప్రతులను చించేసిన కేజ్రీవాల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.