కేరళలో నిఫా వైరస్(Nipah virus) మరోసారి కలకలం సృష్టిస్తోంది. కోజికోడ్ జిల్లాలో ఓ 12 ఏళ్ల బాలుడు ఈ వైరస్ సోకి (symptoms of nipah virus) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. నిఫా వైరస్(nipah virus in kerala) కారణంగానే బాలుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి ధ్రువీకరించారు. మరణించిన బాలుడి మృతదేహం నుంచి నమూనాలను సేకరించిన 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ-పుణె' సైతం నిఫాతోనే బాలుడు మృతిచెందినట్లు నిర్ధరించింది.
నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాలుడి ఆరోగ్యం విషమించి శనివారం రాత్రి మరణించాడని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అయితే.. ఆసుపత్రిలో చేరిన బాలుడిలో నిఫా వైరస్ లక్షణాలు (nipah virus symptoms) కనిపించినప్పటికీ, ఉన్నతాధికారులు స్పందించలేదనే విమర్శలొచ్చాయి.
"బాలుడికి దగ్గరగా ఉన్నవారిని ఆరోగ్యశాఖ గుర్తిస్తోంది. ప్రస్తుతం గుర్తించిన వారిలో ఇప్పటివరకు ఎలాంటి లక్షణాలు కనిపించ లేదు. ఎవరూ ఆందోళన చెందొద్దు. బాలుడి స్నేహితులు, కుటుంబాన్ని గుర్తించి ఐసోలేషన్‌కి తరలించాం."
-వీణా జార్జ్, కేరళ ఆరోగ్య మంత్రి
ఇక నిబంధన ప్రకారం బాలుడి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న నేపథ్యంలో బాలుడి ఇంటి చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు పోలీసులు.
కేరళకు కేంద్ర బృందం..
నిఫా వైరస్‌పై పోరులో భాగంగా జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ బృందాన్ని కేరళకు పంపినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ బృందం రాష్ట్రానికి సాంకేతిక సహకారాన్ని అందించనుంది. తక్షణ ప్రజారోగ్య చర్యలపై సలహాలు ఇవ్వనుంది. ఇందులో భాగంగా క్రియాశీల కేసులపై వివిధ గ్రామాల్లో శాంపిళ్లను సేకరించనున్నారు. దీనితో పాటు వైరస్ లక్షణాలున్న వారిని వేరుచేయడం, బాలుడికి దగ్గరగా ఉన్నవారిని గుర్తించనున్నారు.
గబ్బిలాల లాలాజలం ద్వారా వ్యాప్తిచెందే నిఫా వైరస్ తొలి కేసు(first case of nipah virus) 2018లో కేరళలోని కోజికోడ్ జిల్లాలోనే నమోదైంది. అప్పట్లో నెల రోజుల వ్యవధిలోనే 17 మరణాలు నమోదయ్యాయి. మరో 18 కేసులను రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించింంది.
ఇవీ చదవండి: