దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అర్హత గల వారంతా కరోనా టీకా తీసుకోవాలని కోరారు.
మార్చి4న ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు కేజ్రీవాల్.
మూడవ దశ టీకా పంపిణీ కింద 18-44 వయసు గలవారికి టీకాలు వేసే నమోదు ప్రక్రియ దేశ రాజధానిలో ప్రారంభమైంది. దిల్లీ ప్రభుత్వం ఇటీవల 1.34 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను కొనుగోలుకు అనుమతి ఇచ్చింది.
ఇదీ చదవండి: హోం ఐసోలేషన్ కొత్త మార్గదర్శకాలు ఇవే!