Floating Bridge Collapsed: కర్ణాటక ఉడుపిలో టూరిస్టుల కోసం నిర్మించిన తేలియాడే వంతెన.. ప్రారంభించిన రెండు రోజుల్లోనే ధ్వంసమైంది. రాష్ట్రంలో ఇలాంటి బ్రిడ్జి నిర్మించడం ఇదే తొలిసారి. మాల్పే బీచ్‌కు ఇది ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. అయితే నిరంతరం ఎగిసిపడుతున్న అలలకు ఇంటర్‌లాకింగ్ ప్లేట్స్ తెగిపోయాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
మే 6న ఎమ్మెల్యే రఘుపతి భట్ ఈ తేలియాడే వంతెనను ప్రారంభించారు. 100 మీ.ల పొడవు, 3.5 మీ.ల వెడల్పుతో దీనిని నిర్మించారు. కర్ణాటక కాకుండా కేరళలోని బేపోర్ బీచ్‌లో ఉన్న తేలియాడే వంతెన పర్యటకుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్రిడ్జి రిపేర్ పనులను అధికారులు ముమ్మరం చేశారు. త్వరలోనే దీనిని పర్యటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇదీ చూడండి: నీటిపై తేలియాడే వంతెన.. సముద్రంపై నడిచేయండిక...