ETV Bharat / bharat

కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి- 200 మందికి అస్వస్థత - contaminated water deaths

ఓ గ్రామంలో కలుషిత నీరు తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది ఆస్పత్రిపాలయ్యారు. గ్రామపంచాయతీ నిర్లక్ష్యం వల్లే కలుషిత నీరు ఇంటింటికి సరఫరా అయిందని ఆ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

contaminated water
కలుషిత నీరు
author img

By

Published : Oct 4, 2021, 7:51 AM IST

కర్ణాటక విజయనగర జిల్లాలో కలుషిత నీరు తాగిన ఘటనలో ముగ్గురు మరణించారు. మరో 200 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అసలేం జరిగింది?

విజయనగర జిల్లా మకరబ్బి గ్రామంలో సెప్టెంబర్​ 23న.. కలుషిత నీరు తాగి అనారోగ్యానికి గురై, 50మందికి పైగా ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నీలప్ప అనే 60 ఏళ్ల వృద్ధుడు సెప్టెంబర్​ 28న మరణించాడు.

లక్కమ్మ, బాసమ్మ అనే మరో ఇద్దరు వృద్ధులు.. బళ్లారిలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా, వాంతులతో వారు ఆస్పత్రిలో చేరారు. కానీ, చికిత్స పొందుతూ మరణించారు.

ఆ రెండు బోర్​వెల్స్​ నీళ్లు...

మకరబ్బి గ్రామంలో మూడు బోర్​వెల్స్ ఉన్నాయని ఆ గ్రామస్థులు తెలిపారు. అందులో రెండు బోర్​వెల్స్​ నుంచి వచ్చే నీరు తాగేందుకు పనికి రాదని చెప్పారు. అయితే.. గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంతో.. ఈ రెండు బోర్​వెల్స్​ నుంచి ఇంటింటికి నీటిని సరఫరా చేశారని వారు ఆరోపించారు.

ఇప్పటివరకు కలుషిత నీరు తాగి.. 200 మందికిపైగా ప్రభావితమయ్యారు. బళ్లారి, హోస్పెట్​, హుబ్లిలోని వివిధ ఆస్పత్రుల్లో వారంతా చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి: రైల్వే వంతెనను స్కూల్​గా మార్చిన యువతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.