ETV Bharat / bharat

560 మందికి అంత్యక్రియలు నిర్వహించిన మంత్రి

కరోనాతో చనిపోయిన 560 మందికి సామూహిక అంతిమ సంస్కారాలు నిర్వహించారు కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్​. ఆశోక. మరణించిన వారి అస్థికలను కావేరి నదిలో కలిపారు.

R Ashoka performed rituals
ఆర్​. ఆశోకా, అంతిమ సంస్కారాలు
author img

By

Published : Jun 2, 2021, 6:33 PM IST

కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌. అశోక ఉదారతను చాటుకున్నారు. కరోనాతో చనిపోయిన 560 మంది బాధితుల అస్థికలను కావేరీ నదిలో కలిపారు.

దక్షిణ కర్ణాటకలో చనిపోయిన వారి అస్థికలను నదిలో కలపడం సంప్రదాయంగా వస్తోంది. అయితే కరోనా సహా వేర్వేరు కారణాలతో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ ముందు రాలేదు.

R Ashoka performed rituals
అంత్యక్రియలు నిర్వహిస్తున్న అశోకా
R Ashoka performed rituals
అస్థికలను నదిలో కలుపుతున్న మంత్రి
R Ashoka performed rituals
శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న మంత్రి అశోకా

ఉత్తర భారతంలోని గంగా నదిలో మృతదేహలు తేలుతున్న ఘటన తనను ఎంతగానో కలిచి వేసిందని మంత్రి అశోక చెప్పారు. ఈ క్రమంలోనే కరోనా మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు జరపాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. మృతుల కుటుంబ సభ్యులు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారన్న మంత్రి.. వారి బాధను ప్రభుత్వం పంచుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఇది భావోద్వేగంతో కూడిన అంశమని, మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని మంత్రి వివరించారు.

ఇదీ చూడండి: భర్తను చంపి.. వంటింట్లో పూడ్చిపెట్టి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.