ETV Bharat / bharat

నీటిపై నుంచి ఆకాశంలోకి ఎగిరే విమానం! - దేశంలో మొదటి సీప్లేన్

15 ఏళ్లు శ్రమించి ఓ వినూత్న మైక్రో సీప్లేన్​ను తయారుచేశారు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి. ధృతి అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో.. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో చేతులు కలిపి.. ఈ ప్రాజెక్టు పూర్తిచేశారు. ఈ విమానం నీటిపై తేలుతూ, అక్కడినుంచే గాల్లోకి ఎగరడం దీని ప్రత్యేకత.

Karnataka man made a microlight seaplane
నీటిపై నుంచి ఆకాశంలోకి ఎగిరే విమానం!
author img

By

Published : Mar 19, 2021, 8:58 AM IST

నీటిపై ఎగిరే మైక్రోలైట్ సీప్లేన్

సాధారణంగా విమానం రనవే మీదుగా గాల్లోకి ఎగురుతుంది. కానీ ఇప్పుడు చూడబోయే విమానం సముద్రం లేదా నది ఉపరితలంపైనుంచే నేరుగా గాల్లోకి దూసుకెళ్లగలదు. ఈ వినూత్న విమానం పేరు సీప్లేన్. దేశ మొట్టమొదటి సీప్లేన్‌ను ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌లో ప్రారంభించారు. నర్మదానదిపై తేలియాడి, ఆకాశంలోకి ఎగిరింది ఈ విమానం. దాన్ని ఆదర్శంగా తీసుకుని, కర్ణాటకలోని ఉడుపికి చెందిన పుష్పరాజ్ మైక్రో లైట్ సీప్లేన్ రూపొందించాడు.

ఎయిర్ మోడలింగ్‌గా, ఎన్‌సీసీ శిక్షకుడిగా పనిచేశాను. రిమోట్‌తో కంట్రోల్‌డ్ యూఐవీ విమానం అభివృద్ధి చేశాను. నిజమైన విమానం తయారుచేయాలన్న కల చిన్నప్పటినుంచీ ఉండేది నాకు. కానీ నాకు అనుమతి దొరకలేదు. అందుకే సీప్లేన్ తయారుచేయాలని నిర్ణయించుకున్నా.

--పుష్పరాజ్ అమిన్, సీప్లేన్ ఆవిష్కర్త.

ఈ మైక్రోలైట్ సీప్లేన్‌ తయారుచేసేందుకు 15 ఏళ్లు శ్రమించాడు పుష్పరాజ్. ధృతి అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో.. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో చేతులు కలిపి, ఈ ప్రాజెక్టు పూర్తిచేశాడు. నీటిపై తేలుతూ, అక్కడినుంచే గాల్లోకి ఎగరగలదు ఈ విమానం. దీంట్లో ప్రస్తుతానికి పైలట్ మాత్రమే ఎక్కగలడు. త్వరలోనే ఏడుగురు కూర్చోగలిగే సీప్లేన్‌ను తయారుచేయాలని కలలు గంటున్నాడు పుష్పరాజ్.

4, 6 లేదా 10 సీట్లతో సీప్లేన్ తయారుచేస్తే, సులభంగా వినియోగించుకోవచ్చు. ఇది ఓ పడవ లాగా కూడా పనిచేస్తుంది. నీటిపైనుంచి కూడా టేకాఫ్ అవగలదు. చోటు అవసరం కూడా పెద్దగా ఉండదు. ప్రయాణాలకు, రక్షణ విభాగంలో, పర్యాటకం కోసం కూడా వినియోగించుకోవచ్చు.

--పుష్పరాజ్ అమిన్, సీప్లేన్ ఆవిష్కర్త

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాజెక్టులు అందిస్తూనే, 190 కిలోల బరువు మోయగలిగే సీప్లేన్‌ను రూపొందించాడు పుష్పరాజ్. ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం, ప్రత్యేకంగా తయారు చేయించిన నైలాన్ తాడు, నైలాన్ వస్త్రం, 33 హెచ్​పీ సామర్థ్యమున్న 200 సీసీ సిమోనిని ఇటాలియన్ ఇంజన్లు, 53 అంగుళాల చెక్క ప్రొపెల్లర్‌ను వినియోగించి సీప్లేన్ తయారు చేశాడు. పెట్రోల్ సాయంతో వేగంగా దూసుకెళ్తూ...నీటిపైనుంచే అంతే వేగంతో టేకాఫ్ అవుతుంది.

మనిపాల్‌ యునివర్సిటీలో ఇంజనీరింగ్ చదివాను. పుస్తకాల్లోనిది మాత్రమే నేర్చుకున్నాం కానీ సర్ మాకు ప్రయోగాత్మకంగా శిక్షణనిచ్చారు.

--వినయ్, పైలట్.

సీప్లేన్ తయారుచేసేందుకు పుష్పరాజ్ మొత్తంగా 7 లక్షల రూపాయలు ఖర్చుపెట్టాడు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి, తన పొలంలో సీప్లేన్ తయారీ చేపట్టాడు. పుష్పరాజ్ స్నేహితులు ఆయనకు ఆర్థిక చేయూతనందించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారుల సహకారంతో వర్క్‌షాప్ నిర్మించుకున్నాడు పుష్పరాజ్. ఇలాంటి కలల ప్రాజెక్టులు చేపట్టేందుకు ఏమాత్రం వెనకడుగు వేయకూడదని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాడు.

ఇదీ చదవండి:2కోట్ల మంది చిన్నారులపై నీటి ఎద్దడి ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.