ఫాస్టాగ్ తప్పనిసరి విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఫాస్టాగ్ విధానం ద్వారా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) టోల్ వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ.. బెంగళూరుకు చెందిన గీతా మిశ్రా ఈ పిల్‌ను దాఖలు చేశారు. జస్టిస్ ఏఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది.
ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో ఫాస్టాగ్ వినియోగించడమే ఉత్తమమని ధర్మాసనం పేర్కొంది. ఒకే రోజులో చాలా మంది వ్యక్తుల దగ్గరి నుంచి నోట్లను తీసుకోవడం క్లిష్టమైన ప్రక్రియ అని వ్యాఖ్యానిస్తూ వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది.
ఇదీ చూడండి:18 గంటల్లోనే రహదారి నిర్మాణం.. లిమ్కా బుక్‌లో స్థానం