ఉబర్, ఓలా, ర్యాపిడోపై నిషేధం.. తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు - ర్యాపిడో సేవలపై నిషేధం
యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు అందించే ఓలా, ఉబర్, ర్యాపిడో కంపెనీలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. రాబోయే మూడు రోజుల్లో ఆటో సర్వీసులను నిలుపుదల చేయాలని ఆదేశించింది.
![ఉబర్, ఓలా, ర్యాపిడోపై నిషేధం.. తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు Karnataka govt bans Ola Uber](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16580214-thumbnail-3x2-ola.jpg?imwidth=3840)
ఓలా, ఉబర్, ర్యాపిడో కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. రాబోయే మూడు రోజుల్లో ఆటో సర్వీసులను నిలుపుదల చేయాలని ఆదేశించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొలి 2 కిలోమీటర్ల వరకు రూ.30 వసూలు చేయాలి. ఆపై ప్రతి 2 కిలోమీటర్‌కు రూ.15 చొప్పున తీసుకోవాలి. అయితే, ఈ యాప్స్ తొలి 2 కిలోమీటర్లకే రూ.100 వరకు ఛార్జ్ చేస్తున్నాయని వినియోగదారుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఆటో రిక్షాలను నడుపుతున్నారంటూ ఆయా కంపెనీలకు నోటీసులు పంపింది. మూడు రోజులు సేవలను నిలుపుదల చేయాలని ఆదేశాలిచ్చింది.
![ola ban in karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/olauberautostop_07102022160217_0710f_1665138737_360_0710newsroom_1665141969_829.jpg)
![ola ban in karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/olauberautostop_07102022160217_0710f_1665138737_405_0710newsroom_1665141969_311.jpg)
రవాణా శాఖ నిబంధనల ప్రకారం కేవలం కార్లను మాత్రమే ట్యాక్సీలుగా నడపాలి. ఆటో రిక్షా సేవలను అందించడం నిబంధనలకు విరుద్ధం. పైగా ప్రభుత్వం విధించిన ఛార్జీల కంటే ఆయా కంపెనీలు అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అందుకే ఆటో రిక్షా సర్వీసులను వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు ఆటో డ్రైవర్లు సైతం సొంతంగా యాప్‌ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 'నమ్మ యాత్రి' పేరిట ఓ యాప్‌ను లాంచ్ చేసేందుకు బెంగళూరులోని ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రయత్నిస్తోంది.
ఇవీ చదవండి: పార్టీ కార్యకర్తతో మహిళా ఎమ్మెల్యే పెళ్లి.. చీఫ్ గెస్ట్‌గా సీఎం
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. దారుణంగా కొట్టి చంపిన 22 మంది